- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవినీతి ఆరోపణలు.. ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: పంచాయతీరాజ్ శాఖలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జెడ్పీ సీఈవో ప్రసన్నరాణి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ అంజాద్‌బాషా, జూనియర్ అసిస్టెంట్ వీనిత్‌లు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జెడ్పీ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో ముగ్గురు ఉద్యోగులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు విచారణ జరిపిన ఉన్నతాధికారులు జిల్లాల విభజన సమయంలో ఉద్యోగుల విభజన, పదోన్నతుల్లో అవినీతికి […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: పంచాయతీరాజ్ శాఖలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జెడ్పీ సీఈవో ప్రసన్నరాణి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ అంజాద్‌బాషా, జూనియర్ అసిస్టెంట్ వీనిత్‌లు ఉన్నారు.
ఉమ్మడి వరంగల్ జెడ్పీ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో ముగ్గురు ఉద్యోగులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు విచారణ జరిపిన ఉన్నతాధికారులు జిల్లాల విభజన సమయంలో ఉద్యోగుల విభజన, పదోన్నతుల్లో అవినీతికి పాల్పడినట్టు తెలిపారు. దీంతో ముగ్గురినీ సస్పెండ్ చేస్తూ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






