- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
27 ఏళ్ల తర్వాత మా నాన్న నన్ను ప్రశంసించారు: సుష్మితా సేన్
<p>దిశ, సినిమా: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఒరిజినల్స్ ‘ఆర్య సీజన్ 2’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సుష్మితా సేన్.. తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తన తండ్రి తనను కోల్‌కతా నుంచి పిలిచి ప్రత్యేక అభినందనలు తెలియజేసినట్లు తెలిపిన నటి.. ‘మా అమ్మ నాతో రెండవ సీజన్‌ను చూసింది. నాన్న మాత్రం చూడలేదనుకున్నాను. కానీ కోల్‌కతా నుంచి నాకు కాల్ చేసిన నాన్న.. ‘ఆర్య 2’ చూసిన తర్వాత ఎంతో గర్వపడుతున్నానని […]</p>

దిశ, సినిమా: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఒరిజినల్స్ ‘ఆర్య సీజన్ 2’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సుష్మితా సేన్.. తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తన తండ్రి తనను కోల్‌కతా నుంచి పిలిచి ప్రత్యేక అభినందనలు తెలియజేసినట్లు తెలిపిన నటి.. ‘మా అమ్మ నాతో రెండవ సీజన్‌ను చూసింది. నాన్న మాత్రం చూడలేదనుకున్నాను.
కానీ కోల్‌కతా నుంచి నాకు కాల్ చేసిన నాన్న.. ‘ఆర్య 2’ చూసిన తర్వాత ఎంతో గర్వపడుతున్నానని చెప్పింది. అంతేకాదు నా నటన గురించి చెబుతూ ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. ఇది నాకు అతిపెద్ద ఎమోషనల్ మూమెంట్. నేను మా నాన్నగారిని గర్వపడేలా చేస్తానని ఎప్పుడూ చెప్పేదాన్ని. చివరగా ఆయన నుంచి ఈ అభినందనను పొందేందుకు నాకు 27 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడాయన నా పట్ల గర్వంగా ఫీల్ అవుతున్నారు’ అని వివరించింది. ఇక ‘ఆర్య’ సిరీస్ బెస్ట్ డ్రామా విభాగంలో అంతర్జాతీయ ఎమ్మీ నామినేషన్‌ను పొందగలిగింది.






