- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుశాంత్ ఆత్మహత్య.. ధోనీ ఆగ్రహం
<p>దిశ, స్పోర్ట్స్: వెండితెరపై ధోనీని మైమరిపించేలా నటించి మెప్పించిన నటుడు సుశాంత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణంపై కూల్ కెప్టెన్ ఎలా స్పందిస్తాడా అని అభిమానులు ఎదురు చూశారు. పలుసైట్లు, సామాజిక మాధ్యమాలను వెతికారు. కానీ, ఎక్కడా అతడి స్పందన కనిపించలేదు. ధోనీ ఎలాగూ సామాజిక మాధ్యమాల్లో ఉండడు. కనీసం అతడి భార్య సాక్షి సింగ్ అయినా స్పందించిందా అని వెతికారు. అయితే, ధోనీ స్పందనను అతని మేనేజర్ అరుణ్ పాండే తెలియజేశారు. […]</p>

దిశ, స్పోర్ట్స్: వెండితెరపై ధోనీని మైమరిపించేలా నటించి మెప్పించిన నటుడు సుశాంత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణంపై కూల్ కెప్టెన్ ఎలా స్పందిస్తాడా అని అభిమానులు ఎదురు చూశారు. పలుసైట్లు, సామాజిక మాధ్యమాలను వెతికారు. కానీ, ఎక్కడా అతడి స్పందన కనిపించలేదు. ధోనీ ఎలాగూ సామాజిక మాధ్యమాల్లో ఉండడు. కనీసం అతడి భార్య సాక్షి సింగ్ అయినా స్పందించిందా అని వెతికారు. అయితే, ధోనీ స్పందనను అతని మేనేజర్ అరుణ్ పాండే తెలియజేశారు. ‘సుశాంత్ ఆత్మహత్య వార్త తెలుసుకున్న తర్వాత ఇంట్లో అందరూ నమ్మలేకపోయారు. నా బాధ అయితే వర్ణణాతీతం.అసలు ఇలా ఎందుకు చేశాడని ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు’ అని పాండే వెల్లడించాడు. బయోపిక్ సమయంలో సుశాంత్, ధోనీ కలసి చాలా రోజులు ప్రయాణం చేశారు. అందుకే అతని ఆత్మహత్య అతడికి కోపం తెప్పించింది అని పాండే అన్నాడు. సుశాంత్ కెరీర్‌ను మలుపుతిప్పిన ఎంఎస్ ధోనీ బయోపిక్‌కు అరుణ్ పాండే సహ నిర్మాత కావడం గమనార్హం.






