రియా సుశాంత్‌ను టార్చర్ చేసేది : అంకిత

by  |
రియా సుశాంత్‌ను టార్చర్ చేసేది : అంకిత
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో చోటుచేసుకుంటున్న మలుపులు అచ్చం సినిమానే తలపిస్తున్నాయి. చూస్తుంటే తను సూసైడ్ చేసుకునేందుకు ఇన్ని కారణాలున్నాయా? అనిపిస్తోంది. బాలీవుడ్‌లో నెపోటిజం, ఒత్తిడి, దావూద్ గ్యాంగ్.. ఇలా చాలా విషయాలు వెలుగులోకి రాగా, కొత్తగా అసలు కారణం గర్ల్ ఫ్రెండ్ అని సుశాంత్ తండ్రి కేకే సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్‌ను మెంటల్‌గా టార్చర్ చేసిందని.. అతని ఎకౌంట్ నుంచి కోట్లల్లో డబ్బులు మాయం చేసిందని ఆరోపించాడు. దీంతో సుశాంత్ మరణంపై సీబీఐ ఎంక్వైరీ జరగాలన్న అభిమానుల వాదనను అందరూ సమర్థిస్తున్నారు.

కాగా, ఈ కేసులో ముంబై పోలీసుల విచారణకు హాజరైన సుశాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండె.. రియా గురించి పోలీసులకు ఆసక్తికర విషయాలు తెలిపిందని సమాచారం. మణికర్ణిక సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన అంకిత.. సినిమా సక్సెస్ కావడంతో తనను అభినందించేందుకు సుశాంత్ మెసేజ్ చేశాడని పోలీసులకు తెలిపింది. ఆ సమయంలో రియాతో రిలేషన్‌లో ఉన్న సుశాంత్.. రియా తనను టార్చర్ చేస్తోందని, తనతో బ్రేకప్ చేసుకుంటానని కూడా చెప్పినట్టు వెల్లడించింది. ఆ టెక్స్ట్ మెసేజ్‌లను పోలీసులకు చూపించిందట అంకిత.

కాగా పవిత్ర రిష్తా సీరియల్‌లో కలిసి నటించిన అంకిత, సుశాంత్.. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటామని మీడియా ముందు చెప్పినా.. తర్వాత కొన్ని కారణల వల్ల బ్రేకప్ అయ్యారు. ఆ తర్వాత స్నేహితులుగా కొనసాగగా.. తర్వాత సుశాంత్ రియాతో రిలేషన్ షిప్‌లో ఉన్నాడు.



Next Story

Most Viewed