సుశాంత్ లాస్ట్ మూవీ ట్రైలర్

by  |
సుశాంత్ లాస్ట్ మూవీ ట్రైలర్
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’ ట్రైలర్ రిలీజ్ అయింది. ముఖేష్ చోబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2012 బెస్ట్ సెల్లర్.. ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ ఆధారంగా రూపుదిద్దుకుంది. మే 8న రిలీజ్ కానున్న ఈ సినిమా జులై 14న డిస్నీ+హాట్ స్టార్‌లో రిలీజ్ కాబోతుంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న హీరోయిన్ సంజనా సంఘీని ప్రేమించే పాత్రలో కనిపించిన సుశాంత్.. ట్రైలర్‌లోనే ప్రేక్షకులను తన చిలిపితనంతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండగా.. సినిమాతో, సుశాంత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ స్పెషల్ పోస్ట్ పెట్టాడు దర్శకుడు ముఖేశ్ చోబ్రా.

ముఖేశ్‌కు ఇదే తొలి సినిమా కాగా, రెండేళ్లు పడిన కష్టాన్ని మీ చేతుల్లో పెడుతున్నట్లు ప్రేక్షకులను ఉద్దేశించి చెప్పాడు. ఈ రెండేళ్లలో ఎందరో స్నేహితులు తన మనసుకు దగ్గరయ్యారని.. ఎత్తు పల్లాలు చూశానని.. సంతోషం, బాధ రెండు అనుభవాలు పొందానని తెలిపాడు. తన డ్రీమ్, తన ఫ్రెండ్ సుశాంత్ డ్రీమ్ అయిన ఈ ప్రాజెక్ట్‌ను మీ ముందుకు తెస్తున్నానన్న ముఖేశ్.. చివరి శ్వాస ఉన్నంత వరకు సుశాంత్ తనలో జీవించి ఉంటాడని తెలిపారు. ఈ సినిమా తనలో చాలా మార్పులు తీసుకొచ్చిందని.. సినిమాతో ముడిపడిన ప్రతీ మూమెంట్ జీవితాంతం గుర్తుంటుందని చెప్పాడు. సుశాంత్ చివరి సినిమా ప్రతీ ఒక్కరికీ ఫ్రీగా అందుబాటులో ఉండటం ఆనందంగా ఉందన్న డైరెక్టర్.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్‌తో చూసి ఎంజాయ్ చేయాలని కోరారు. కాగా సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు.

Next Story

Most Viewed