హిందీ బిగ్ బాస్‌లో హీరో గర్ల్ ఫ్రెండ్స్ కొట్లాట?

by  |
హిందీ బిగ్ బాస్‌లో హీరో గర్ల్ ఫ్రెండ్స్ కొట్లాట?
X

దిశ, సినిమా : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్‌ ఇండియాలోనే మోస్ట్ పాపులర్ షోగా చెప్పొచ్చు. 14 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోలో లాస్ట్ సీజన్‌లో టీవీ యాక్ట్రెస్ రుబీనా టైటిల్ కొట్టేయగా.. త్వరలో న్యూ సీజన్ స్టార్ట్ కానుంది. ఇందుకోసం కంటెస్టెంట్ సెలక్షన్స్‌లో బిజీగా ఉన్నారు నిర్వాహకులు. ఈ క్రమంలో లేట్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ గర్ల్ ఫ్రెండ్స్ అంకిత లోఖాండే, రియా చక్రవర్తి ఇద్దరూ బిగ్ బాస్ హిందీ సీజన్ 15లో పార్టిసిపేట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, సెలబ్రిటీలలో మరో కోణాన్ని చూపిస్తూ.. టీఆర్పీ రేటింగ్‌లో అగ్రగామిగా కొనసాగుతున్న బిగ్ బాస్.. అంకిత, రియ ఈ సీజన్‌లో పాల్గొంటే కచ్చితంగా ది బెస్ట్ సీజన్ అవుతుందంటున్నారు నిపుణులు. పైగా ఇండియా వైడ్‌గా ఉన్న సుశాంత్ అభిమానులు.. తన రిలేషన్ షిప్స్, పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న క్రమంలో ఈ నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్తున్నారు. కనీసం ఈ షో ద్వారా అయినా సుశాంత్ డెత్ కేసులో నిందితురాలిగా ఉన్న రియా గురించి కొంచెమైనా తెలుస్తుందని అభిప్రాయపడుతున్నారు సుశాంత్ ఫ్యాన్స్.



Next Story

Most Viewed