ధోనీ గురించి సర్‌ప్రైజ్ న్యూస్

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్: మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ గురించి ఓ విషయాన్ని చెప్పుకొచ్చాడు. తన చివరి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా చివరి ఓవర్ల ఆటలో గంగూలీకి జట్టు సారధ్య బాధ్యతలను ధోనీ అప్పగించాడంట. ఆ విషయాన్ని ఇప్పుడు గంగూలీ గుర్తుచేసుకున్నాడు. అయితే ఆ సమయంలో తన మనసంతా రిటైర్‌మెంట్ పైనే ఉందని, ఆ చివరి మూడు, నాలుగు ఓవర్లలో [&hellip;]</p>

ధోనీ గురించి సర్‌ప్రైజ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ గురించి ఓ విషయాన్ని చెప్పుకొచ్చాడు. తన చివరి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా చివరి ఓవర్ల ఆటలో గంగూలీకి జట్టు సారధ్య బాధ్యతలను ధోనీ అప్పగించాడంట. ఆ విషయాన్ని ఇప్పుడు గంగూలీ గుర్తుచేసుకున్నాడు. అయితే ఆ సమయంలో తన మనసంతా రిటైర్‌మెంట్ పైనే ఉందని, ఆ చివరి మూడు, నాలుగు ఓవర్లలో ఏం చేశానో అనేది తనకు సరిగా గుర్తులేదని చెప్పుకొచ్చాడు. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీ సమర్థుడని గుంగూలీ అన్నారు. ఆ రోజు ధోనీ అలా చేస్తాడని తాను ఊహించలేదని.. ఆ సమయంలో తాను చాలా సర్‌ప్రైజ్ అయ్యానని గంగూలీ చెప్పుకొచ్చాడు.

Next Story