జగిత్యాలలో సర్పంచ్, ఉప సర్పంచ్‌ల సస్పెన్షన్

by  |

దిశ, కరీంనగర్: గ్రామ అభివృద్ధి కోసం వినియోగించాల్సిన నిధులను తప్పుదారి పట్టించారనే కారణంతో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రవి ఉత్వర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్, ఉప సర్పంచ్‌లు ఇద్దరూ ఆరునెలల పాటు పాలనా వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. అవిశ్వాస తీర్మాన సమావేశం మినహా ఏ గ్రామ సమావేశానికి హాజరు కావొద్దని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం వీరిపై చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ రవి తెలిపారు.

Tags : funds mis use, surpanch and vice surpanch suspension, collecter ravi, jagityala dist



Next Story

Most Viewed