హిందీలో ‘ఆకాశమే నీ హద్దు రా’.. హీరో ఎవరో..?

by  |
Hero-Suriya
X

దిశ, సినిమా : సుధా కొంగర డైరెక్షన్‌లో సూర్య లీడ్ రోల్ పోషించిన తమిళ చిత్రం ‘సూరారై పోట్రు’. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దు రా’ పేరుతో వచ్చిన సినిమా ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. గతేడాది అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్ కాబడిన చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన హీరో సూర్య.. హిందీ వెర్షన్‌కు కూడా సుధా కొంగరనే డైరెక్ట్ చేస్తుందని తెలిపారు.

అంతేకాదు ఇందులో సూర్య నటించడం లేదని తెలుస్తుండగా.. తన ప్రొడక్షన్ బ్యానర్ 2డీతో కలిసి అబుదాంటియా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ ప్రాజెక్ట్‌ నిర్మించనుంది. ఇక మాతృక విషయానికొస్తే ముందుగా థియేట్రికల్ రిలీజ్‌కు ప్లాన్ చేసినా పాండమిక్ కారణంగా ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించిన సినిమాలో పరేష్ రావల్‌తో పాటు సీనియర్ తెలుగు యాక్టర్ మోహన్ బాబు కీలక పాత్రల్లో కనిపించారు.



Next Story

Most Viewed