‘సూర్య40’ షూటింగ్.. త్వరలో జాయిన్ కానున్న హీరో

by  |
‘సూర్య40’ షూటింగ్.. త్వరలో జాయిన్ కానున్న హీరో
X

దిశ, సినిమా : హీరో సూర్య కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను పాండిరాజ్ డైరెక్ట్ చేస్తుండగా.. డి ఇమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సత్యరాజ్, జయప్రకాశ్, శరణ్య పొన్వన్నన్, సుబ్బు పంచు, దేవదర్శిని, మాస్టర్ ఫేమ్ శిబి భువన చంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమం ఘనంగా జరగ్గా.. ఇందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేసింది మూవీ యూనిట్. సూర్య40వ చిత్రంగా వస్తున్న సినిమాకు ‘అన్బు, అరివ్’ స్టంట్ మాస్టర్స్ కాగా.. జాకీ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేయనున్నారు.

కాగా కరోనా నుంచి కోలుకుని ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్న సూర్య.. త్వరలో చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. ఈ చిత్రంతో పాటు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘నవరస’ వెబ్ సిరీస్ చేస్తున్న సూర్య.. వెట్రిమారన్ డైరెక్షన్‌లో ‘వాడివసల్’ ప్రాజెక్ట్‌‌ను లైన్‌లో పెట్టాడు.


Next Story

Most Viewed