చేతిలో తుపాకీతో సెట్స్‌లో కనిపించిన సూర్య..

by  |
చేతిలో తుపాకీతో సెట్స్‌లో కనిపించిన సూర్య..
X

దిశ, సినిమా : ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూర్య.. ఆ తర్వాత కోలీవుడ్ సిరీస్ ‘నవరస’ షూటింగ్‌లో పాల్గొన్నారు. అదే సమయంలో తనకు కొవిడ్ పాజిటివ్ రావడంతో అప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యారు. అయితే లేటెస్ట్‌గా ఆయన తన 40వ మూవీ ఫిల్మింగ్ ప్రారంభించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు సూర్య. మళ్లీ సెట్స్‌కు రావడం ఆనందంగా ఉందంటూ.. ఇంట్రెస్టింగ్ స్టిల్ షేర్ చేశాడు. పరదా వెనుక సూర్య ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తుండగా.. చేతిలో రివాల్వర్‌తో శత్రువును టార్గెట్ చేసిన పిక్‌కు ఫిదా అయ్యారు ఫ్యాన్స్. పాండిరాజ్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సోషల్ యాంగిల్‌ను కూడా టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ చిత్రానికి ఇమాన్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు.


Next Story

Most Viewed