- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్య కాలేజ్ డేస్.. వీడియో వైరల్
<p>దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ టాలెంటెడ్ హీరో సూర్య వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయింది. కోలీవుడ్ హీరో, సాహో ఫేమ్ అరుణ్ విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ కాలేజ్ డేస్‌ను గుర్తుచేసుకున్న సూర్య వీడియోను ఓ అభిమాని షేర్ చేయగా.. అది అరుణ్ విజయ్ దాకా వచ్చేసింది. దీంతో తను కూడా మోస్ట్ లవ్ అండ్ రెస్పెక్ట్‌తో ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. కాగా ఈ వీడియోలో కాలేజ్ రోజుల్లో తను చేసిన అల్లరి గురించి వివరించాడు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ టాలెంటెడ్ హీరో సూర్య వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయింది. కోలీవుడ్ హీరో, సాహో ఫేమ్ అరుణ్ విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ కాలేజ్ డేస్‌ను గుర్తుచేసుకున్న సూర్య వీడియోను ఓ అభిమాని షేర్ చేయగా.. అది అరుణ్ విజయ్ దాకా వచ్చేసింది. దీంతో తను కూడా మోస్ట్ లవ్ అండ్ రెస్పెక్ట్‌తో ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. కాగా ఈ వీడియోలో కాలేజ్ రోజుల్లో తను చేసిన అల్లరి గురించి వివరించాడు సూర్య. ‘నేను అరుణ్ విజయ్‌కు సీనియర్‌ను, నేను చదువుతున్న కాలేజ్ గురించి తెలుసుకున్న నటుడు విజయ్.. అరుణ్‌ను అదే కాలేజ్‌లో చేర్పించారు. ఈ విషయం తెలియడంతో అరుణ్‌ను ర్యాగింగ్ చేసేందుకు ప్రయత్నించేవాడిని’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ వీడియోలో అరుణ్ విజయ్ ఫిట్‌నెస్ లెవల్స్‌పై కూడా సూర్య ప్రశంసలు కురిపించారు.
— ArunVijay (@arunvijayno1) December 17, 2020
కాగా, అరుణ్ విజయ్ కొడుకు అర్నవ్‌ను తన నిర్మాణ సంస్థ 2డి ప్రొడక్షన్ ద్వారా బిగ్ స్క్రీన్‌పై లాంచ్ చేయబోతున్నారు సూర్య. కిడ్స్ డ్రామాగా వస్తున్న సినిమాకు సరోవ్ షన్ముగమ్ డైరెక్టర్ కాగా అరుణ్ విజయ్ అతిథిపాత్రలో కనిపించబోతున్నారు.






