బ్రదర్స్ స్క్రీన్ షేర్..

110

మలయాళం బ్లాక్ బస్టర్ హిట్ మూవీ “అయ్యప్పనుమ్ కోషియుమ్” చిత్రానికి డిమాండ్ భారీగా ఉంది. ఇప్పటికే తెలుగు, హిందీ రీమేక్ రైట్స్ కొనుగోలు చేయగా.. తాజాగా తమిళ్ లోనూ ఈ సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళ్ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న హీరో సూర్య.. తమ్ముడు కార్తీతో కలిసి సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తోంది.

ఇటు టాలీవుడ్,అటు కోలీవుడ్ లో సూర్య, కార్తీలకు భారీ క్రేజ్ ఉంది. ఈ అన్నదమ్ములను ఒకేసారి తెరపై చూసేందుకు అభిమానులు వెయిట్ చేస్తుండగా.. ఈ సినిమా అయితేనే కరెక్ట్ అని డిసైడ్ అయ్యారట సూర్య. స్క్రీన్ షేర్ చేసుకునేందుకు అన్నదమ్ములు కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నారట. ఈ వార్తతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం ఇద్దరు ఈగోయిస్టిక్ వ్యక్తుల మధ్య జరిగే కథ కాగా.. మలయాళంలో పృథ్వీ రాజ్, బిజూ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సాచి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను రంజిత్, పి.ఎం. శశిధరన్ నిర్మించారు. కాగా ఈ సినిమా తెలుగు రీమేక్ లో రానా, బాలకృష్ణ నటిస్తున్నారని సమాచారం ఉండగా.. హిందీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న జాన్ అబ్రహం తానే కీ రోల్ చేస్తాడని తెలుస్తోంది. మరో హీరో ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..