‘నవరస’ షూటింగ్‌లో సూర్య..

by  |
‘నవరస’ షూటింగ్‌లో సూర్య..
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ కార్మికులకు చేయూతనందించేందుకు కోలీవుడ్ ఇండస్ట్రీ సంకల్పించింది. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ ప్లాన్ చేసిన ఇండస్ట్రీ.. తద్వారా వచ్చిన లాభాలను కార్మికులకు అందించనుంది. తొమ్మిది పార్ట్‌లతో కూడిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్‌ను మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ నిర్మిస్తుండగా.. ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా పనిచేసేందుకు నటులు, టెక్నీషియన్స్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. బెజాయ్ నంబియార్, అరవింద్ స్వామి, గౌతమ్ మీనన్, కార్తిక్ సుబ్బరాజు, కార్తిక్ నరేన్, కేవీ ఆనంద్, పొన్రం, రతీంద్రన్ ప్రసాద్, హలిత షమీన్ డైరెక్షన్‌లో వస్తున్న ఆంథాలజీ ‘నవరస’గా వస్తుండగా.. ఇందుకోసం గౌతమ్ మీనన్ తన పని షురూ చేశారు. ఈ సిరీస్‌లో నటిస్తున్న సూర్య మంగళవారం షూటింగ్‌లో జాయిన్ అయినట్లు సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

నైన్ ఎమోషన్స్.. నైన్ స్టోరీస్.. వన్ ఇండస్ట్రీ.. ఫర్ ద పీపుల్.. టాగ్ లైన్‌తో వస్తున్న నవరసలో సెలెబ్రిటీ స్టార్స్ నటిస్తుండగా.. విజయ్ సేతుపతి, సిద్ధార్థ్, నిత్యామీనన్, ఐశ్వర్యా రాజేష్, అరవిందస్వామి, ప్రకాశ్ రాజ్ లాంటి ప్రముఖులు ఈ లిస్ట్‌లో ఉన్నారు. వీరితో పాటు సౌత్ ఇండస్ట్రీ నుంచి మరింత మంది బిగ్ స్టార్స్‌‌ను ఆంథాలజీలో భాగస్వామ్యం చేసేందుకు మణిరత్నం ప్రయత్నిస్తుండగా.. బిగ్ స్టార్స్ చేసే ఫస్ట్ సిరీస్ ఇదే కానుందని సమాచారం. కాగా ఇప్పటికే సేతుపతి తన షూటింగ్ పోర్షన్ కంప్లీట్ చేశాడని తెలుస్తోంది.

కాగా ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సూర్య.. తన తర్వాతి చిత్రాన్ని వెట్రిమారన్ డైరెక్షన్‌లో చేయనున్నారు. ‘వాడివసల్’ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా జల్లికట్టు నేపథ్యంలో సాగనుండగా.. గ్రామీణ యువకుడిగా కనిపించేందుకు జుట్టు పెంచే పనిలో ఉన్నాడు.

Next Story

Most Viewed