రెమ్యునరేషన్ పెంచేసిన సూర్య..

by  |
రెమ్యునరేషన్ పెంచేసిన సూర్య..
X

దిశ, వెబ్‌డెస్క్ : హీరో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మూవీలో తన నటనకు నూటికి నూరు శాతం మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్ సీన్, అమ్మతో సెంటిమెంట్ సీన్స్‌లో సూర్య నటనకు ఖుదోస్ చెప్పాల్సిందే. ఇంతకు ముందు కూడా ఇలాంటి అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా సరే.. కథల ఎంపిక సరిగ్గా లేకపోవడంతో డిజాస్టర్‌లు చూశాడు సూర్య. కానీ ఈ సారి అన్నీ కుదరడంతో ఆకాశం నీ హద్దురా చిత్రంతో అద్భుత విజయం అందుకున్నారు.

కాగా ఈ సినిమా హిట్‌తో సూర్య రెమ్యునరేషన్ పెంచాడని, తను నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. ఫ్లాఫ్స్‌లో ఉన్నప్పుడు తక్కువ డబ్బులు తీసుకున్న సూర్య.. ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేకపోవడంతో ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. పాండిరాజ్ దర్శకత్వంలో వస్తున్న తన తర్వాతి చిత్రం కోసం అందుకే ఎక్కువ డబ్బులు తీసుకున్నాడని టాక్. కాగా ఈ సినిమాలో రష్మిక మందన ఫీమేల్ లీడ్‌గా ఫైనల్ అయిందని సమాచారం.

Next Story

Most Viewed