బిగ్ స్క్రీన్‌పై.. సూర్య రియల్ లైఫ్

by  |
బిగ్ స్క్రీన్‌పై.. సూర్య రియల్ లైఫ్
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చిన తమిళ్ సూపర్ స్టార్ సూర్య.. తన నెక్స్ట్ మూవీతో ఫ్యాన్స్‌కు పర్ఫెక్ట్ ట్రీట్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాండిరాజ్ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ బ్యానర్స్ వారు నిర్మిస్తున్న సూర్య 40వ చిత్రం ట్విట్టర్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. న్యూ ఇయర్ రోజున సినిమా టైటిల్, షూటింగ్ గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కోలీవుడ్‌లో టాక్ నడుస్తుండగా.. ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. అనౌన్స్ వస్తుందనే వార్తనే ట్రెండ్ చేసిన ఫ్యాన్స్, ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్‌పై హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

డైరెక్టర్ పాండిరాజ్.. సూర్య రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌నే స్టోరీ లైన్‌గా తీసుకున్నారనే వార్తతో ఖుష్ అవుతున్నారు. సూర్య ఫ్యామిలీ నెలకొల్పిన స్వచ్ఛంద సంస్థ ‘అగరం’ ఈవెంట్స్, నీట్‌కు వ్యతిరేకంగా నిలబడి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరిన విధానం, జల్లికట్టు వ్యతిరేకంగా ఆందోళన తెలపడాన్ని కథా వస్తువుగా తీసుకున్నారని సమాచారం. దీంతో రీల్ లైఫ్‌లో తమ అభిమాన హీరో రియల్ స్టోరీని చూసేందుకు వెయిట్ చేస్తున్నామంటున్నారు అభిమానులు. సూపర్ స్పీడ్‌గా చిత్రీకరణ పూర్తి చేసి 2021 ఫస్ట్ హాఫ్‌లోనే సినిమా విడుదల చేయాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed