రానా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

by  |
రానా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: రానా.. మిహికా బజాజ్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించి ఈ లాక్‌డౌన్‌లో ఫ్యాన్స్‌కు ఒక శుభవార్త చెప్పాడు. దీంతో మంగళవారం అభిమానులు, తోటి నటుల విషె‌స్‌తో సోషల్ మీడియా హోరెత్తింది. అయితే త్వరలోనే దగ్గుబాటి ఫ్యామిలీలో వెడ్డింగ్ బెల్స్ మోగనున్నాయని ప్రకటించారు రానా తండ్రి సురేష్ బాబు. ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా అంతకుముందే రానా, మిహికా బజాజ్ వివాహం ఉండబోతుందని తెలిపారు. ప్రస్తుతం పెళ్లి ప్రణాళికల్లో బిజీగా ఉన్నామని.. తుది నిర్ణయం తీసుకోగానే వివరాలు ప్రకటిస్తామన్నారు సురేష్ బాబు. ‘పిల్లలు ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారని.. ఇద్దరు కూడా చాలా కాలంగా ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నారని’ అన్నారు. ఈ విషయంలో కుటుంబం మొత్తం చాలా ఆనందంగా ఉందని.. ఈ కష్ట సమయాల్లో ఒక వేడుక జరుపుకునే అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

Next Story

Most Viewed