గ్లామర్‌ షోతో రెచ్చిపోయిన సురేఖా వాణి కూతురు.. మీడియాపై ఫైర్

by  |
గ్లామర్‌ షోతో రెచ్చిపోయిన సురేఖా వాణి కూతురు.. మీడియాపై ఫైర్
X

దిశ, సినిమా: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకుంటుందన్న రూమర్స్ మీడియాలో ప్రచారం అయ్యాయి. సింగర్ సునీతను ఆదర్శంగా తీసుకుని తను కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుందని న్యూస్ స్ప్రెడ్ కావడంతో దీనిపై క్లారిటీ ఇచ్చింది సురేఖా వాణి. అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. అయినా కూడా దీనిపై చర్చ జరుగుతుండడంతో సురేఖ కూతురు సుప్రిత సోషల్ మీడియాలో మీడియాపై కామెంట్ చేసింది. ‘ కొత్తగా క్రియేట్ చేయకుండా ఉన్న న్యూస్ చెప్పండి. మీ రెవెన్యూ కోసం ఒకరి క్యారెక్టర్‌, రెప్యుటేషన్ నాశనం చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు జర్నలిస్టులు, ప్రైమ్ న్యూస్ చానల్స్ అని చెప్పుకోవడం మానేయండి’ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్, యాడ్స్‌లో నటించిన సుప్రిత.. సోషల్ మీడియాలో గ్లామర్ షోతో రెచ్చిపోతోంది. దీంతో ఎప్పటికప్పుడు నెగెటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి.


Next Story