బావలు ఇలాంటి బామ్మర్దులతో జాగ్రత్త.. టెంపోకి కట్టేసి ఈడ్చుకెళతారేమో

123

దిశ,వెబ్‌డెస్క్: నా చెల్లెల్నే కొడతావా అంటూ బామ్మర్ది.., బావను ట్రక్కుతో ఈడ్చుకెళ్లాడు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గుజరాత్‌ సూరత్ జిల్లా కడోదరలో బాలకిషన్ రాథోడ్ తన భార్య షీతల్‌తో కలిసి నివాసం ఉంటున్నాడు. రాథోడ్ స్థానికంగా ఉన్న ప్రింటింగ్ మిల్లులో పని చేస్తున్నాడు. అయితే మద్యానికి బానిసైన రాథోడ్ భార్య షీతల్ ను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు. రోజులు గడుస్తున్నాయి కానీ భర్తలో ఏమాత్రం మార్పురాలేదు. అందుకే షీతల్ ప్రాణ భయంతో భర్త ఆగడాల్ని తన తల్లిదండ్రులకు చెప్పి కన్నీరుమున్నీరైంది. దీంతో ఆగ్రహానికి గురై షీతల్ అన్న అనీల్ చౌహాన్.. మద్యం మత్తులో ఉన్న రాథోడ్ ను టెంపోకు కట్టి రోడ్డు మీద దాదాపు అర కిలోమీటర్ ఈడ్చుకెళ్లాడు. అనంతరం స్థానికులు టెంపును అడ్డగించి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రగాయాలైన రాథోడ్ ను ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా కడోదర ఎస్సై బ్రహ్మ్‌భట్‌ మాట్లాడుతూ చెల్లెలి బాధచూడలేక.., బావకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని టెంపోకు కట్టి ఈడ్చుకెళ్లాడు. బాధితుడు రాథోడ్ ఆరోగ్యం విషమంగా ఉందని ఎస్సై బ్రహ్మ భట్ తెలిపారు. నిందితులకు కరోనా టెస్ట్ లు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..