రవీంద్రభారతిలో సురభి నాటకోత్సవాలు ప్రారంభం

by  |

దిశ, తెలంగాణ బ్యూరో : కళాకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాలను సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివ కుమార్‌తో కలిసి బుధ‌వారం ప్రారంభించారు.

Surabhi Drama Festival

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కళాకారులకు పింఛన్లు అందజేసి అండగా నిలుస్తున్నామన్నారు. ప్రజలను చైతన్య పర్చడంలో కళాకారుల పాత్ర అద్వితీయం అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రముఖ వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న, భాగన్న గౌడ్, సురభి వేణుగోపాల్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed