హరీష్ రావుపై 41 కేసులు

by Shyam |

<p>        ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్, ఇతర కేసుల వివరాలను ప్రజలకు తెలిసేలా ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది . ఈ మేరకు ఆ కేసులకు సంబంధించిన వివరాలను ఆయా రాజకీయ పార్టీలు తమ అధికారిక వెబ్ సైట్లలో, అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది . క్రిమినల్ కేసులు ఉన్న వారిని సహించేది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై [&hellip;]</p>

హరీష్ రావుపై 41 కేసులు
X

ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్, ఇతర కేసుల వివరాలను ప్రజలకు తెలిసేలా ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది . ఈ మేరకు ఆ కేసులకు సంబంధించిన వివరాలను ఆయా రాజకీయ పార్టీలు తమ అధికారిక వెబ్ సైట్లలో, అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది . క్రిమినల్ కేసులు ఉన్న వారిని సహించేది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల చిట్టా సిద్ధమైంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అగ్ర నేతలు సహా, కాంగ్రెస్, బీజేపీ, టీటీడీపీ నేతలపై నమోదైన కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావుపై అత్యధికంగా 41 కేసులు ఉండగా.. కేసీఆర్‌పై 13, కేటీఆర్‌పై 17కేసులు నమోదయ్యాయి.

Next Story