లిక్కర్ అమ్మకాలను బ్యాన్ చేయలేం : సుప్రీంకోర్టు

by  |
లిక్కర్ అమ్మకాలను బ్యాన్ చేయలేం : సుప్రీంకోర్టు
X

న్యూఢిల్లీ: లిక్కర్ అమ్మకాలపై నిషేధాజ్ఞలు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. లిక్కర్ అమ్మకాలను బ్యాన్ చేయలేమని పేర్కొంది. సామాజిక దూరాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వాలే లిక్కర్‌ను ఆన్‌లైన్‌లో అమ్మడానికి లేదా హోం డెలివరీ విధానాలను పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించింది. లిక్కర్ అమ్మకాలను నిషేధించాలని దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) విచారిస్తూ ఈ మేరకు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మూడో దశ లాక్‌డౌన్ సడలింపులతో దేశవ్యాప్తంగా కంటైన్‌మెంట్ ఏరియాలు మినహా లిక్కర్ షాపులు తెరుచుకున్నాయి. దీంతో మందుబాబులు పెద్ద ఎత్తున వైన్స్ షాపుల ముందు గుమిగూడారు. సామాజిక దూరాన్ని పక్కనపెట్టి మద్యం కోసం ఎగబడ్డారు. దీంతో వైన్స్ షాపుల ముందే వైరస్ వేగంగా ఇతరులకూ వ్యాపించే అవకాశమున్నదని ఆందోళనలు వెలువడ్డాయి. పిటిషన్‌దారు తరఫు న్యాయవాది అడ్వకేట్ జే సాయి దీపక్ వాదనలు వినిపిస్తూ.. వైన్స్ షాపుల ముందు సామాజిక దూరాన్ని పాటించడం లేదు. లిక్కర్ షాపులు స్వల్పంగా ఉన్నాయిగానీ, దాన్ని కొరకు నిలుచుంటున్నవారి సంఖ్య మెండుగా ఉన్నదని తెలిపారు. కాగా, సుప్రీంకోర్టు ఈ పిల్ పై స్పందిస్తూ.. లిక్కర్ అమ్మకాలపై కోర్టు జోక్యం చేసుకోబోదని, దీనికి విధానపరమైన నిర్ణయం అవసరమవుతుందని పేర్కొంది. సామాజిక దూరం కోసమైతే.. రాష్ట్ర ప్రభుత్వాలు హోం డెలివరీని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది.

TAGS: LIQUOR, BAN, SUPREME COURTS, home delivery


Next Story

Most Viewed