విస్త‌ృత ధర్మాసనానికి ఈడబ్ల్యూఎస్ కోటా పిటిషన్లు

by  |
విస్త‌ృత ధర్మాసనానికి ఈడబ్ల్యూఎస్ కోటా పిటిషన్లు
X

న్యూఢిల్లీ: ఈడబ్ల్యూఎస్(ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) కోటా చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేసింది. సీజేఐ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గతనెల 31న రిజర్వ్‌లో ఉంచిన ఈ ఆదేశాలను తాజాగా జారీ చేసింది. ఉపాధి, విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10శాతం కోటా చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయొద్దని కేంద్రం అభ్యంతరం తెలిపింది.

కాగా, రాజ్యంగధర్మాసనానికి సిఫారసు చేయాలని పిటిషనర్లు కోరారు. కేవలం ఆర్థిక ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్‌కు పదిశాతం కోటా కేటాయించడం, దీనికి వీలు కల్పించిన 103వ రాజ్యాంగ సవరణను సవాల్ చేశారు. రాజ్యాంగ మూల సూత్రాలను ఉల్లంఘించారని, ఇంద్రా సానీ కేసు ప్రకారం రిజర్వేషన్లపై 50శాతం సీలింగ్‌ నియమాన్ని బేఖాతరు చేశారని ఆరోపించారు.

కేంద్రం నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించలేదని, తగిన కారణాలుంటే 50శాతం సీలింగ్‌ను రిజర్వేషన్లు దాటడంలో తప్పేం లేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదించారు. ఈ రిజర్వేషన్లు వెనుకబడినవారి పురోగతి కోసమేనని తెలిపారు. తాజాగా, ఈ పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.


Next Story

Most Viewed