- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీడియో కాన్ఫరెన్స్‌లో సుమోటో కేసు విచారణ
<p>కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా కోర్టు హాల్లోకి జనం రాకుండా చూస్తోంది. అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్ ప్రకటించగానే సుప్రీంకోర్టు కూడా వర్చువల్ కోర్టు నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. ఈ మేరకు సోమవారం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ సుమోటో కేసును విచారించారు. ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్, నాగేశ్వరరావులు ఉన్నారు. హైకోర్టుల్లోనూ వర్చువల్ కోర్టుల ఏర్పాటుకు కావాల్సిన చర్యలను తీసుకోవాలని సీజే ఆదేశించారు. […]</p>

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా కోర్టు హాల్లోకి జనం రాకుండా చూస్తోంది. అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్ ప్రకటించగానే సుప్రీంకోర్టు కూడా వర్చువల్ కోర్టు నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. ఈ మేరకు సోమవారం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ సుమోటో కేసును విచారించారు. ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్, నాగేశ్వరరావులు ఉన్నారు. హైకోర్టుల్లోనూ వర్చువల్ కోర్టుల ఏర్పాటుకు కావాల్సిన చర్యలను తీసుకోవాలని సీజే ఆదేశించారు. కేవలం లాక్‌డౌన్ సమయంలోనే కాదు, ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా ఈ-కోర్టులు ఏర్పాటు చేయాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

వీడియోకాల్‌లో బెయిల్ వాదనలు
దిశ, నిజామాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులో ఓ వ్యక్తి బెయిల్ పిటిషన్‌పై సోమవారం వీడియో కాల్ ద్వారా నిజామాబాద్ సెషన్ కోర్టులో వాదనలు జరిగాయి. తొలుత కేసు వివరాలను ఈ-పైలింగ్ చేశారు. బెయిల్ పిటిషన్‌పై న్యాయవాదులు గొర్రెపాటి మాధవరావు, మాణిక్‌రాజ్‌లు ఇంటి వద్ద నుంచే వీడియో కాల్ ద్వారా వాదనలు వినిపించారు. ఎనిమిదో అదనపు జిల్లా అడిషనల్ సెషన్స్ జడ్జి గోవర్ధన్‌రెడ్డి వీడియో కాల్ ద్వారా బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్నారు.






