- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి పనులకు ఈసీకి దరఖాస్తు చేసుకోవాల్సిందే..
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇచ్చిన ఆదేశాలను సవరించాలన్న పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అభివృద్ధి పనులకు ఈసీ అనుమతి తీసుకోవాలన్న ఆదేశాన్ని సవరించాలని.. రాష్ట్ర ప్రభుత్వం తరపున లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అయితే ఎన్నికల సంఘం ఏవైనా అభివృద్ధి పనులను ఆపిందా అని సీజే ప్రశ్నించారు. కాగా, ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రోహత్గి తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో లేనప్పుడు ప్రభుత్వం ఈసీ అనుమతి ఎలా […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇచ్చిన ఆదేశాలను సవరించాలన్న పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అభివృద్ధి పనులకు ఈసీ అనుమతి తీసుకోవాలన్న ఆదేశాన్ని సవరించాలని.. రాష్ట్ర ప్రభుత్వం తరపున లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అయితే ఎన్నికల సంఘం ఏవైనా అభివృద్ధి పనులను ఆపిందా అని సీజే ప్రశ్నించారు. కాగా, ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రోహత్గి తెలిపారు.
ఎన్నికల కోడ్ అమలులో లేనప్పుడు ప్రభుత్వం ఈసీ అనుమతి ఎలా తీసుకుంటుందని రోహత్గి ప్రశ్నించారు. ఎన్నికలు రద్దు చేయలేదని, వాయిదా మాత్రమే వేశామని ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. అభివృద్ధి పనులకు ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈసీ అనుమతి ఇవ్వకపోతే పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. దీనిపై తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.






