- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ప్రభుత్వానికి సుప్రీం షాక్..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీం విచారణ జరిపింది. అయితే, వాదోపవాదాల అనంతరం జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా.. విచారణను మూడు […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీం విచారణ జరిపింది. అయితే, వాదోపవాదాల అనంతరం జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా.. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ తీర్పు వలన వైసీపీ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలినట్లు తెలుస్తోంది.
ఇటు కేవియట్ పిటిషన్ వేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రొఫెసర్లకు రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇదిలాఉండగా, ఏపీలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని 80శాతం మంది స్వాగతిస్తున్నారని.. ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించినా ఫలితం లేకుండా పోయింది.






