కన్నీరు పెట్టుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్

438
Rajinikanth

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్ గానగంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని స్మరించుకున్నారు. ‘ఎస్పీబీ 45 ఏళ్లు నా గాత్రంలా జీవించారు. ‘అన్నాత్తె’ సినిమా కోసం ఆయన పాడిన పాటలో నటించాను. కానీ, నాకు ఆయన పాడే చివరి పాట ఇదే అవుతుందని కలలో కూడా అనుకోలేదు. నేనెంతగానో అభిమానించే ఎస్పీబీ మనమధ్య లేకపోయినా ఆయన మధురమైన స్వరం ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటారు’ అని రజనీకాంత్‌ తమిళ్‌లో ట్వీట్‌ చేశారు. అయితే రజనీ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తె’లో ఎస్పీబీ పాటను రిలీజ్‌ చేసిన సందర్భంగా బాలసుబ్రహ్మణ్యంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు రజనీ. ఇక శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయన్, కీర్తి సురేశ్, ఖుష్బూ ప్రధానపాత్రల్లో కనిపించబోతుండగా.. నవంబరు 4న రిలీజ్‌ కానుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..