కలకలం : రజనీ ఇంటి ఎదుట అభిమాని ఆత్మహత్యాయత్నం

by Vadlamudi Anukaran |

<p>దిశ,వెబ్ డెస్క్ : తమిళనాడు సూపర్ స్టార్ రజని పాలిటికల్ యూటర్న్ పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు రజనీని తమగుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ వస్తున్న అభిమానులు ఆయన దిష్టిబొమ్మల్ని దగ్ధం చేస్తున్నారు. అన్నాత్తే షూటింగ్ లో అనారోగ్యానికి గురై అపోలో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్… డిశ్చార్జ్ అనంతరం రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించారు. ఆరోగ్యం సహకరించట్లేదని.. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రజనీ యూటర్న్‌తో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. [&hellip;]</p>

కలకలం : రజనీ ఇంటి ఎదుట అభిమాని ఆత్మహత్యాయత్నం
X

దిశ,వెబ్ డెస్క్ : తమిళనాడు సూపర్ స్టార్ రజని పాలిటికల్ యూటర్న్ పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు రజనీని తమగుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ వస్తున్న అభిమానులు ఆయన దిష్టిబొమ్మల్ని దగ్ధం చేస్తున్నారు.

అన్నాత్తే షూటింగ్ లో అనారోగ్యానికి గురై అపోలో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్… డిశ్చార్జ్ అనంతరం రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించారు. ఆరోగ్యం సహకరించట్లేదని.. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రజనీ యూటర్న్‌తో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. తాము దైవంలా ఆరాధించే వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని జీర్ణించుకోలని అభిమానులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు.

తాజాగా రజనీకాంత్ ఇంటి ముందు మురుగేషన్ అనే అభిమాని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆత్మహత్యాయత్నానికి ముందు రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ డిమాండ్ చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలపాలైన అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

కాగా ప్రస్తుతం అభిమాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.24గంటలు గడిస్తే కానీ అభిమాని మురుగేషన్ ఆరోగ్యం గురించి చెప్పలేమని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది.

Next Story