భళా ‘రుక్మిణి’.. చీరోచిత నాట్య విన్యాసాలు

by  |
భళా ‘రుక్మిణి’.. చీరోచిత నాట్య విన్యాసాలు
X

దిశ, ఫీచర్స్ : అందరిలో ఒకరిలా కాకుండా, తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలనుకునేవారు ఎప్పుడూ రొటీన్‌కు భిన్నంగా ప్రయత్నిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన మహిళే రుక్మిణి విజయకుమార్. స్వతహాగా కళాకారిణి అయిన రుక్మిణి సంప్రదాయ నృత్యంలో విశేష ప్రతిభ కనబరుస్తోంది. స్టేజీ ప్రదర్శనల్లో సత్యభామగా ప్రత్యేకమైన ఆహార్యంతో ఆకట్టుకుంటోంది. ఇక ‘రాధాకల్ప డ్యాన్స్ కంపెనీ’ యూట్యూబ్ చానల్‌ ద్వారా భరత నాట్యం, ఇతర సంప్రదాయ నృత్య వీడియోలను అప్‌లోడ్ చేసే రుక్మిణి.. ఇటీవలే ఇన్‌స్టా వేదికగా తను షేర్ చేసిన చీరోచిత విన్యాసాల వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

గతేడాది ‘నమామి యోగ విద్యే’ కార్యక్రమం కోసం చీరోచిత విన్యాసాలు చేశానని, వాటిని గుర్తు చేసుకునేందుకు ఈ వీడియో పోస్ట్ చేసినట్లు రుక్మిణి పేర్కొంది. వీడియోలో రుక్మిణి విన్యాసాలకు బ్యాక్ గ్రౌండ్‌లో ధనుష్ ‘లోకల్ బాయ్’ సినిమాలోని ‘శివోహం’ సాంగ్ ప్లే అవుతుంటుంది. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘సంప్రదాయ ఆధునికతల కలబోత రుక్మిణి, బ్యూటిఫుల్ డ్యాన్సర్’ అని కామెంట్లు చేస్తున్నారు.


Next Story