హ్యపీ బర్త్ డే సూపర్ స్టార్ రజినీకాంత్

by  |
హ్యపీ బర్త్ డే సూపర్ స్టార్ రజినీకాంత్
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళ నాట తలైవా, సూపర్ స్టార్ రజినీ కాంత్ ఇవాళ తన 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. రజినీ బర్త్ డే సందర్భంగా తమిళనాట తలైవా అభిమానులు పండుగ జరుపుకుంటున్నారు. గల్లిగల్లీలో బ్యానర్లు కట్టి తమ అభిమాన నటుడిపై ప్రేమను చాటుతున్నారు.

ఇదిలాఉండగా, రజినీ పొలిటికల్ పార్టీపై ఈరోజు క్లారిటీ వస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. బర్త్ డే వేడకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, సూపర్ స్టార్ రజినీకి భారత ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రజినీ ఫ్యాన్స్, రాజకీయవేత్తలు, పలువురు ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story