`సూప‌ర్ ప‌వ‌ర్` ట్రైల‌ర్ లాంచ్‌

by  |
`సూప‌ర్ ప‌వ‌ర్` ట్రైల‌ర్ లాంచ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: వపర్ ఫుల్ పోలీస్ చిత్రాలతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు శివ జొన్న‌ల‌గ‌డ్డ. ఓ పక్క హీరోగా చేస్తూనే మరోపక్క దర్శకత్వ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం 'సూప‌ర్ ప‌వ‌ర్'. ఈ చిత్రం ట్రైల‌ర్‌ లాంచ్ శనివారం సురేష్ కొండేటి చేతుల మీదుగా ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. అనంతరం సురేష్ కొండేటి మాట్లాడుతూ..

“నేను విడుద‌ల‌య్యే ప్ర‌తి సినిమా క‌లెక్ష‌న్స్ తెలుసుకుంటుంటాను. శివ జొన్న‌ల‌గ‌డ్డ తొలి సినిమా 'మాస్ ప‌వ‌ర్' క‌లెక్ష‌న్స్ విని నేను ఆశ్చ‌ర్య‌పోయాను. ఒక చిన్న సినిమా, పైగా అందరూ కొత్తవాళ్లు చేసిన సినిమా ఓపెనింగ్స్ భారీ స్థాయిలో రావ‌డ‌మ‌నేది మామూలు విష‌యం కాదు. ఆయ‌న సినిమాలు యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్‌లో చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటాయ‌ని విన్నాను. ఇప్పుడు సూప‌ర్ ప‌వ‌ర్ ట్రైల‌ర్ చూశాక అది నిజం అనిపించింది. ట్రైల‌ర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా కూడా పెద్ద స‌క్సెస్ కొట్టాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా.“ అని అన్నారు. కాగా ఈ చిత్రం స‌ర్వేశ్వ‌ర మూవీస్ ప‌తాకంపై డా.గుద్దేటి బ‌స‌వ‌ప్ప మేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియ అగ‌స్టిన్, మీర‌ హీరోయిన్స్. కొండేక‌ర్ బాలాజి, ర‌మేష్ క‌డూరి స‌హ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు.


Next Story

Most Viewed