హాలోవీన్ సంబరాల్లో సన్నీలియోన్

by  |
హాలోవీన్ సంబరాల్లో సన్నీలియోన్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఏటా జరిగే వేడుకల్లో ‘హాలోవీన్’ కూడా ఒకటి. పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ కల్చర్ ఇండియాకు ఎప్పుడో వచ్చేసింది. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులు, యువకులు, పెద్దలు.. దెయ్యాలు, రాక్షసుల దుస్తులు ధరించి ఇతరులను భయపెట్టే ప్రయత్నం చేస్తారు. విందువినోదాలు కూడా చేసుకుంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నిలియోన్ హాలోవీన్ సెలెబ్రేషన్స్ చేసుకుంది.

హాలోవీన్ వేడుకల సందర్భంగా ఇంద్రధనుస్సు రంగులతో మెరిసిపోతున్న డ్రెస్‌ను ధరించిన సన్నీ లియోన్.. భర్త డేనియల్ వెబెర్, పిల్లలు నిషా, అషర్‌లతో సెలెబ్రేషన్స్ పిక్స్‌ను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ‘హ్యాపీ హాలోవీన్. ప్రతీ ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేసుంటారు. ఈ సంవత్సరం ఫేవరెట్ హాలీడే ఇదే’ అని సన్నీ చెప్పుకొచ్చింది.

ఇక అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంప‌తులు కూడా.. ప్రతి పండుగకు ఆయా సంప్రదాయం ప్రకారం త‌మ పిల్ల‌లను రెడీ చేస్తారు. ఈ క్రమంలో హాలోవీన్ రోజున అర్హ.. దిన‌న్ అవ‌తారంలో ద‌ర్శ‌న‌మివ్వ‌గా, అయాన్ పెన్నివైస్ గెట‌ప్‌‌లో సందడి చేశారు. మరోవైపు మంచు ల‌క్ష్మి కూడా త‌న పిల్ల‌ల‌ను హాలోవీన్ గెట‌ప్స్‌‌లో తయారు చేసింది.



Next Story

Most Viewed