- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అయోధ్యలో మసీదు నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు
by Shamantha N |
<p>లక్నో: అయోధ్యలో ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల భూమిలో మసీదు నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు ప్రక్రియ మొదలైందని యూపీ సున్ని వక్ఫ్ బోర్డు ప్రకటించింది. వక్ఫ్ బోర్డు అధ్యక్షులు జుఫర్ అహ్మద్ ఫరూఖీ ఈ ట్రస్టుకు చీఫ్ ట్రస్టీగా ఉండనున్నారు. ఫరూఖీ మాట్లాడుతూ, తాము ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. అయోధ్యలోని ధన్నీపూర్ గ్రామంలో కేటాయించిన ఐదు ఎకరాలలో మసీదు, ఇండో-ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, లైబ్రరీ, హాస్పిటల్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. ఈ […]</p>

X
లక్నో: అయోధ్యలో ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల భూమిలో మసీదు నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు ప్రక్రియ మొదలైందని యూపీ సున్ని వక్ఫ్ బోర్డు ప్రకటించింది. వక్ఫ్ బోర్డు అధ్యక్షులు జుఫర్ అహ్మద్ ఫరూఖీ ఈ ట్రస్టుకు చీఫ్ ట్రస్టీగా ఉండనున్నారు. ఫరూఖీ మాట్లాడుతూ, తాము ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు.
అయోధ్యలోని ధన్నీపూర్ గ్రామంలో కేటాయించిన ఐదు ఎకరాలలో మసీదు, ఇండో-ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, లైబ్రరీ, హాస్పిటల్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. ఈ ట్రస్టులో 15 మంది సభ్యులుంటారని తెలిపారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గతేడాది అనుమతినిస్తూ మసీదు నిర్మాణానికి అయోధ్యలోని ప్రసిద్ధ స్థలంలో ఐదు ఎకరాల భూమి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Next Story






