‘మర్యాద కృష్ణయ్య’గా సునీల్.. సీక్వెల్ కాదు కదా!

by  |
‘మర్యాద కృష్ణయ్య’గా సునీల్.. సీక్వెల్ కాదు కదా!
X

దిశ, సినిమా : కమెడియన్‌గా సూపర్ సక్సెస్ అందుకున్న సునీల్, హీరోగా మాత్రం ఆశించిన మేర విజయాలు సాధించలేకపోయాడు. ఈ నేపథ్యంలో అటు హీరోగా చేస్తూనే, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘కలర్ ఫొటో’ సినిమాలో విలన్‌‌గా ఆకట్టుకున్న సునీల్.. ‘మర్యాద కృష్ణయ్య’ మూవీతో మరోసారి హీరోగా రాబోతున్నాడు.

ఈ రోజు(ఆదివారం) సునీల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న హీరోగా తెర‌కెక్కుతున్న కొత్త చిత్రం ‘మర్యాద కృష్ణయ్య’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సాయికార్తీక్‌ సంగీతం అందిస్తున్నాడు. టైటిల్ చూస్తుంటే సునీల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘మ‌ర్యాద రామ‌న్న’ పోలికలు కనిపిస్తుండగా.. సునీల్ మరోసారి అమాయకపు, భయస్తుడి పాత్రలో కనిపించనున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌ ద్వారా అర్థమవుతోంది. ఏటీవీ ఒరిజినల్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై కిషోర్‌ గరికపాటి, టీజీ విశ్వప్రసాద్‌, అర్చనా అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Next Story