సునీల్ న్యూ 'కలర్ ఫోటో'

by  |
సునీల్ న్యూ కలర్ ఫోటో
X

టాలీవుడ్ స్టార్ కమెడియన్‌‌గా ఓ వెలుగు వెలిగిన సునీల్..’అందాల రాముడు’, ‘మర్యాద రామన్న’ చిత్రాలతో హీరోగా మారిపోయాడు. ఓ దశలో సిక్స్ ప్యాక్‌ కూడా ట్రై చేసినా హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. కమెడియన్‌గా తనదైన టైమింగ్‌తో అదరగొట్టే సునీల్‌ను తెలుగు ఆడియన్స్ హీరోగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. ‘పూల రంగడు’, ‘మిస్టర్ పెళ్లి కొడుకు’, ‘తడాఖా’, ‘భీమవరం బుల్లోడు’, ‘కృష్ణాష్టమి’, ‘జక్కన్న’ ఇలా అన్ని సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో హీరోగా ఫుల్‌స్టాప్ పెట్టేసి..మళ్లీ కామెడీ బాటపట్టాడు. రీసెంట్‌గా ‘డిస్కో రాజా’ సినిమాలో విలన్‌గానూ మెప్పించి తనలో మరో షేడ్ చూపించాడు. డిస్కోరాజా సక్సెస్ రేట్ ఎలా ఉన్నా ఈ సినిమాతో సునీల్‌ పాత్రకు మాత్రం మంచి పేరు వచ్చింది. అందుకే తమిళ్, కన్నడ సినిమాల్లో విలన్‌గా సెట్ అయిపోయే ప్రయత్నంలో ఉన్నాడు. అంతేకాదు బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలోనూ విలన్‌గా మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ రోజు (శుక్రవారం) సునీల్ బర్త్ డే సందర్భంగా మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది ‘కలర్ ఫోటో’ సినిమా యూనిట్. ఇందులో ఎస్సై రామరాజుగా సునీల్ లుక్ అదిరిపోయింది. పోలీస్ ఆఫీసర్‌గా సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న సునీల్..పాత్ర ఈ సినిమాలో కీలకంగా ఉండనుందట. కాగా ‘మజిలీ’, ‘ప్రతి రోజూ పండగే’, ‘విజేత’ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న కమెడియన్ సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నటుడు సందీప్ రాజ్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా..హృదయ కాలేయం డైరెక్టర్ సాయి రాజేష్ లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.


Next Story

Most Viewed