ఈ రాశి వారు సరైన ప్లాన్‌తో పెట్టుబడులు పెట్టండి

by  |
Panchangam
X

తేది : 18, జూలై 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : ఆదివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : నవమి
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 41 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 27 ని॥ వరకు)
నక్షత్రం : స్వాతి
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 32 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 6 ని॥ వరకు)
యోగము : సాధ్యము
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 6 గం॥ 47 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 17 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 19 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 0 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 52 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ గంటలకు)

మేష రాశి: వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కోసం సరైన ప్లాన్ తో పెట్టుబడులు పెట్టండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి వారు మీ జీవితంలో చాలా విలువైన వారు. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి. మీ బంగారు భవిష్యత్తు కోసం డబ్బును కూడపెట్టండి మరియు ఆదా చేయండి. అవసరం లేని వస్తువులు మరియు ఆడంబరాల కోసం ఖర్చు పెట్టడం వల్ల డబ్బు వృధా. విద్యార్థులు చదువు మీద పూర్తి శ్రద్ధ పెట్టండి విజయం మీదే. ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

వృషభ రాశి: వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. హాలిడే జాలిడే అని పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టకండి. ఇతరులతో వాదోపవాదాలకు దిగకండి. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం వారి చదువులను ఒక కంట గమనించండి. వ్యాపారస్తులకు మంచి లాభాలు. భవిష్యత్తు కొరకు సరైన ప్రణాళిక వేయండి గాలిలో మేడలు కట్టకండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

మిధున రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే ధైర్యం పట్టుదల అవసరం. ఆదాయ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. తప్పులు జరగకుండా శ్రద్ధ పెట్టి పని చేయండి. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు కుటుంబం ఖర్చుల గురించి గొడవ పడే అవకాశం. వాటిని మరిచిపోయి ఆనందంగా గడపండి.

కర్కాటక రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక పట్టుదల అవసరం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి ముఖ్యంగా పిల్లలతో గడపడం వలన మీకు ఎంతో ఎనర్జీ. ఆఫీసు పనులతో చాలా బిజీగా ఉంటారు. పనులను బాధ్యతగా, తప్పులు జరగకుండాకుండా నిర్వర్తించండి మీకు అందరి ప్రశంసలు లభిస్తాయి. విద్యార్థులు మీరు సమయం వృధా చేస్తున్నారు దాని వలన విజయం లభించదు. ఉపయోగం లేని బాతాఖానీ ల వలన సమయం వృధా. దాని బదులు ఉపయోగపడే విషయాలకు ఉపయోగించండి.

కన్యారాశి: తెలివిగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొంతమందికి ఇంకా జీతాలు అందకపోవచ్చు దానివల్ల డబ్బుకి ఇబ్బంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాట్లాడండి. మీ పెద్దవారు హర్ట్ అయ్యే అవకాశం. ఆఫీసు పనులలో అధిక శ్రమ. సరైన గుర్తింపు రాకపోవడం మిమ్మల్ని విచారానికి గురిచేస్తుంది. మీ పిల్లలు టీవీ మొబైల్ లతో కాలక్షేపం చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారు గమనించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు సామరస్యంతో కుటుంబ వ్యవహారాల గురించి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తూ గడుపుతారు.

సింహరాశి: అనుకున్న కార్యాలను సాధించడానికి ఆత్మవిశ్వాసము పట్టుదల అవసరమో దానివలన తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలంగా బాధపడుతున్న రోగం నుంచి విముక్తి. ఇతరులతో వాదోపవాదాలకు దిగకండి. దానివలన అనవసర సమస్యలు. ఆఫీసులో పనులను ప్రణాళికతో పూర్తిచేస్తారు దానివల్ల అందరి ప్రశంసలు. ఆదాయ వ్యవహారాలు పూర్తిగా సంతృప్తికరం. పొదుపు చేస్తారు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు వ్యాపారం లో నూతన పెట్టుబడుల కొరకు అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

ధనుస్సు రాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఎంతో కాలంగా చేద్దామనుకుంటూ ఆపేసిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. దైవకార్యలలో పాల్గొనటం ద్వారా మానసిక ప్రశాంతత. ఫిట్నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. దీర్ఘకాలికంగా ఉన్న రోగాలు తగ్గుముఖం పడతాయి. పార్టీ లలో పాల్గొనే వారు తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని ధనలాభము పొదుపు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన ఒకరి మీద ఒకరికి అనురాగం పెరుగుతుంది.

వృశ్చిక రాశి: అనుకున్న కార్యాలను సాధించడానికి సరైన ప్రణాళిక వేయండి. ఆఫీస్ పనులను ఆడుతూ పాడుతూ పూర్తి చేస్తారు. తోటి ఉద్యోగుల సహాయము, పై అధికారుల ప్రశంసలు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమందికి వారి పిల్లలనుంచి ధన సహాయం. వ్యాపారస్తులు లాభాల కొరకు కొంత సమయం ఆగండి. అన్ని పనులను కలగాపులగం చేయకండి ఒక దాని తర్వాత ఒకటి పూర్తి చేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం మానేయండి మీ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపండి.

తులారాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే ఆత్మరక్షణ కాదు ఆత్మవిశ్వాసం కావాలి. దాని వలన సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. వారు మీ జీవితంలో చాలా విలువైన వారు. వ్యాపార విస్తరణకు పథకాలు వేస్తారు. ఆఫీస్ పనులను సకాలంలో చకచకా పూర్తి చేస్తారు. సీనియర్ల సహాయం లభిస్తుంది. మీ ఆరోగ్యానికి తగిన భోజనం చేయండి. అనవసరపు బాతాఖానీ ల వలన సమయం వృధా. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక తీపి గుర్తు.

మకర రాశి: ఆశావహ దృక్పథంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. మరింత సంపాదన కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. ప్రతి దానికి అవతల వారిని తప్పు పట్టడం మానేయండి. ఈ అలవాటు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. తోటి ఉద్యోగులతో సామరస్యంగా ప్రవర్తించండి. విద్యార్థులు స్నేహితులతో బాతాఖానీ లతో సమయాన్ని వృధా చేస్తున్నారు. అనుకోని ఖర్చులు వలన డబ్బుకు ఇబ్బంది ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

కుంభరాశి: ఆశావహ దృక్పథంతో సహనంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దం లో చూడటం మానేయాలి లేకపోతే లేనిపోని రోగాలు. బంధువులతో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆదాయ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అనుకోని ఖర్చులు వలన విచారం కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మీన రాశి: ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించకండి. మిమ్మల్ని మీరు నిందించు కోకండి మీ మీద నమ్మకం పెంచుకోండి. ఆఫీసులో మీ పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. సరైన ప్రణాళికతో పనులు పూర్తి చేయండి. మీ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి ముఖ్యంగా మీ పిల్లలతో గడపటం వలన మీకు ఎంతో ఎనర్జీ. మీ వస్తువులు డబ్బు జాగ్రత్త. బయటి తిండి వలన అజీర్తి. మీ స్నేహితుల సహాయం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రాశి స్త్రీల కి మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.


Next Story

Most Viewed