ఈ రాశి వారు.. పిల్లల చదువుపై శ్రద్ధ పెట్టట్లేదు

by  |
Panchangam
X

తేది : 11, జూలై 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : ఆదివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పాడ్యమి
(నిన్న ఉదయం 6 గం॥ 46 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 7 గం॥ 46 ని॥ వరకు)
నక్షత్రం : పుష్యమి
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 1 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 21 ని॥ వరకు)
యోగము : హర్షణము
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 9 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 8 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (నిన్న రాత్రి 10 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 8 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 7 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 16 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 1 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గంటలవరకు)

మేష రాశి: వ్యాపారస్తులు వ్యాపారంలో లాభాలు కోసం మరింత కష్టపడాలి. ఆధ్యాత్మిక వ్యవహారాల పట్ల ఆసక్తి చూపిస్తారు. మెడిటేషన్ వలన మానసిక ఆరోగ్యం. విద్యార్థులు ఆటల మీద కన్నా చదువు మీద దృష్టి పెట్టడం మంచిది కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. వారితో పరుషంగా మాట్లాడకండి. వారు హర్ట్ అవుతారు. కుటుంబంలో పెద్దవారు మీకు అండగా ఉంటారు. వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అనుకోని పెద్ద ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

వృషభ రాశి: కొన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అనుకున్న కార్యాలను సాధించాలంటే పట్టుదల, సహనం అవసరం. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. మోసపూరిత పథకాల జోలికి పోకండి. సహోదరుల సహాయం లభిస్తుంది. ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేస్తారు. ఆదాయం కన్నా ఖర్చులు అధికం. ఆఫీసు పనులలో అధిక శ్రమ. పనులు సకాలంలో పూర్తి చేయటానికి సరైన ప్రణాళిక వేయండి. అధిక శ్రమ వలన చెవి నొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ పట్టుదల వదిలిపెట్టండి మీ వైవాహిక జీవితములో ఒక ఆనందకరమైన రోజుని గడపండి.

మిధున రాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటి అలంకరణ కొరకు వస్తువులు కొంటారు. ఆఫీసు పనులలో అదనపు బాధ్యతలను అధిక శ్రమ. అనవసరపు బాతాఖానీల వలన సమయం వృధా. కుటుంబ సభ్యులలో ఒకరి అనారోగ్యం కొరకు డబ్బు ఖర్చు పెట్టవలసి రావచ్చు. ఇంటిలో పెద్ద వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అనుకోని అతిధి వలన ఇబ్బంది. బయట భోజనం వల్ల అజీర్తి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కర్కాటక రాశి: సహనంతో వ్యవహరించండి. కొంతమంది కొత్త నగలు కొంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. ఇంటిలో పెద్ద వారి ధన సహాయం లభిస్తుంది. మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన కుటుంబం లో ఆహ్లాదకర వాతావరణం. జీవితంలో కొన్ని విషయాలలో సెంటిమెంట్ కన్నా ప్రాక్టికల్ అప్రోచ్ మంచిది. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు. దుబారా ఖర్చులు నివారించండి. సీజనల్ మార్పుల వలన జలుబు దగ్గు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

కన్య రాశి: ముఖ్యమైన నిర్ణయాలను అన్ని విధాలుగా ఆలోచించి తీసుకోండి. మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఒక శుభవార్త వలన కుటుంబ సభ్యులలో ఆనందం మీరు ప్రగతి వైపు పయనిస్తున్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్లు ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. నిర్లక్ష్య ధోరణి వల్ల చెడ్డపేరు రావొచ్చు జాగ్రత్త. మద్యపానం పొగతాగడం మానివేయండి.

సింహరాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. స్నేహ పూర్వకమైన ప్రవర్తనతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మీ వ్యక్తిత్వలోపాలను మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ భార్య భర్తల సామరస్య ధోరణి వల్ల కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. కుటుంబ సభ్యులతో ఆదాయ వ్యవహారాల గురించి చర్చిస్తారు సరైన సలహాలు తీసుకుంటారు. తోటి ఉద్యోగుల సహాయం లభిస్తుంది దానివలన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాదాస్పద విషయాల జోలికి వెళ్ళకండి. దానివలన చెడ్డపేరు రావచ్చు. కావలసినంత ధనం చేతికందుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

ధనస్సు రాశి: నూతన పరిచయాల వలన లాభాలు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. మీ భార్య భర్తలు ఒకరినొకరు తప్పులు పట్టుకోవటం మానేయండి బంధాలను తెగే వరకు లాగకండి. బావిలో కప్ప లాగా బతకకండి బయట ప్రపంచాన్ని చూడండి. పాత బకాయిలను వసూలు చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. ఆఫీసులో తోటి ఉద్యోగులతో జాగ్రత్త వహించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఉద్యోగులకు జీతాలు పెరుగుదల. అవసరాలకు కావలసిన ధనం లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

వృశ్చిక రాశి: సరైన ప్రణాళికతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఊపిరి సలపని పనులు ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. మీ భార్య భర్తలు ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోండి. కలహాలు సమసిపోతాయి. కుటుంబ సభ్యులలో ఒకరి అనారోగ్యం కొరకు డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం. పాత ప్రాజెక్ట్ లు పూర్తి కాకుండా కొత్త ప్రాజెక్టుల జోలికి పోకండి. మీ సామర్ధ్యాన్ని ఉపయోగించి ఆఫీసులో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త సహనాన్ని కోల్పోయి మీతో గొడవ పెట్టుకోవడం వలన మీకు మానసిక అశాంతి.

తులారాశి: దేవాలయ సందర్శనం మరియు దైవ ప్రార్థన వలన మానసిక బలం పై అధికారుల ఒత్తిడి వలన ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయటానికి మరింత కష్టపడాలి. తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అత్యాశతో ధన సంపాదనకు ప్రయత్నం చేయకండి. మీ పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టట్లేదు గమనించండి. స్నేహితులతో వాదోపవాదాలకు దిగకండి దానివల్ల గొడవలు జరగవచ్చు ఆదాయం పరవాలేదు ఖర్చులను జాగ్రత్త.ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

మకర రాశి: మంచి భవిష్యత్తు రానున్నది సరైన ప్రణాళికలు వేయండి. సరైన కమ్యూనికేషన్ వలన మీకు విజయం. బయటి భోజనం కన్నా ఇంటి భోజనం మిన్న. వ్యాపారస్తులు వ్యాపారంలో లాభాల కోసం మరింత కష్టపడాలి. స్నేహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల కొరకు కొంత సమయం కేటాయించండి వారు మీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కుంభరాశి: సరైన ప్రణాళిక సహనంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా దానిని మనసులోకి ఎక్కించుకో కండి. లేకుంటే మీకు మానసిక అశాంతి. మంచి ధనయోగం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు దానివలన మీకు ఎంతో ఎనర్జీ. ఆఫీసులో పనులను పూర్తి చేయడంలో మీ శక్తి సామర్ధ్యాలకు అందరి ప్రశంసలు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

మీన రాశి: ఆత్మవిశ్వాసము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఫిట్ గా ఉండడానికి మీకు తగిన ఆటలను ఆడండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వారికి నచ్చిన షాపింగ్ చేస్తారు. సహోదరుల సహాయం లభిస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక అద్భుతమైన రోజు. అధిక శ్రమ ఉన్నప్పటికీ మీ సామర్ధ్యాన్ని ఉపయోగించి ఆఫీసులో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.


Next Story

Most Viewed