ఈ రాశివారికి ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి

206

తేది : 19, సెప్టెంబర్ 2021
ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : ఆదివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : త్రయోదశి (నిన్న ఉదయం 6 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 0 ని॥ వరకు)
నక్షత్రం : శతభిష (ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 23 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 29 ని॥ వరకు)
యోగము : ధృతి
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు ఉదయం 10 గం॥ 36 ని॥ నుంచి మధ్యాహ్నం 12 గం॥ 12 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 8 గం॥ 15 ని॥ నుంచి 9 గం॥ 51 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 37 ని॥ నుంచి 5 గం॥ 25 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 43 ని॥ నుంచి 6 గం॥ 14 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 9 ని॥ నుంచి 1 గం॥ 40 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 4 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 15 ని॥ లకు
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : కుంభము

మేష రాశి : ఈ రోజంతా అనేక రకాల పనులతో బిజీగా ఉంటారు. ఆధ్యాత్మిక మార్గం మీద ఆసక్తి కనబరుస్తారు. మానసిక శారీరక ఆరోగ్యం కొరకు యోగా మెడిటేషన్ చేయండి. మరింత సంపాదన కొరకు నూతన ప్రణాళికలు వేస్తారు. విలాసవంతమైన వస్తువుల మీద పెట్టుబడి పెడతారు. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. కొంతమంది స్థిరాస్తిని డెవలప్మెంట్ కు ఇస్తారు. ఆఫీసులో మీ పని నిబద్ధత పై అందరి ప్రశంసలు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

వృషభ రాశి : సహనము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఈ రోజంతా అనేక రకాల పనులతో బిజీగా ఉంటారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రముఖులతో పరిచయాలు. స్థిరాస్తి పెట్టుబడులలో లాభాలు. వ్యాపారులు ఈరోజు తమ డబ్బు మీద జాగ్రత్త వహించండి కొంతమందికి హాలిడే ట్రిప్. మీ శక్తి సామర్థ్యాలను వెలికి తీయండి ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయండి తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తల వైవాహిక జీవితంలోకి మూడవ వ్యక్తిని రానీయకండి.

మిధున రాశి : ఈరోజు మీ మానసిక స్థితి బాగుంది. మీరు ఆనందంగా ఉంటారు ఎదుటివారిని సంతోష పరుస్తారు. కుటుంబ సభ్యులలో ముఖ్యంగా తల్లిదండ్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొంతమందికి ప్రయాణాలలో ఇబ్బందులు. కలప వ్యాపారులకు లాభాలు. ఆదాయం పరవాలేదు. కుటుంబ అవసరాల కోసం ఎక్కువ ఖర్చు పెడతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కర్కాటక రాశి : ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. వ్యాపారులు లాభాల కోసం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆదాయ వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించండి. సరైన ప్రణాళికతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసులో మీ పని నిబద్ధత పట్ల అందరి ప్రశంసలు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. వారితో పరుషంగా మాట్లాడకండి. మీ పిల్లలకు కాలాన్ని వృధా చేయవద్దని చెప్పండి. తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకుండా వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఫిట్ నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక ఆనందకరమైన రోజు.

సింహరాశి : ఇంటిలో దైవ కార్యాలు చేస్తారు. అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగండి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు. కొంతమంది ఉద్యోగం మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం. మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. ప్రముఖ వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడండి వారి నుంచి సలహాలు తీసుకోండి. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.

కన్యారాశి : ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. వ్యాపారులకు సులభంగా లాభాలు. ఏవైనా పథకాల్లో పెట్టుబడులు పెట్టే ముందర వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి. ఆఫీసులో శ్రద్ధ పెట్టి పనులను సకాలంలో పూర్తి చేయండి. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి. వారితో గడపడం వలన మీకు ఎంతో ఎనర్జీ. వంశ పారంపర్యంగా రావలసిన ధనం చేతికందుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోండి నమ్మకమే మీ వైవాహిక జీవితానికి పునాది.

తులారాశి : సహనంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. తొందరపాటు వద్దు ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. స్థిరాస్తి వ్యాపారులు ఈ రోజు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదనపు బాధ్యతల వలన ఆఫీసు పనులలో అధిక శ్రమ. ఈరోజు మీ ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇతరులకు గౌరవం ఇవ్వండి. పాత విషయాల గురించి ఆలోచించి ఉపయోగం లేదు గందరగోళం వదిలేయండి. సమస్యల పట్ల మీ నిర్ణయము ఫలితాలనిస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన మీ వైవాహిక జీవితం ఆనందకరంగా వుంటుంది.

వృశ్చిక రాశి : ఈరోజు అన్ని పనులలో ఎగుడు దిగుడులు. కొన్ని ముఖ్య అవసరాలను వదులుకోవాల్సి వస్తుంది. సహనంతో వ్యవహరించాలి. మీ చిరునవ్వే సమస్యలకు సమాధానం. ఆస్తమా మరియు థైరాయిడ్తో బాధపడేవారు జాగ్రత్తగా ఉండండి. హాలిడే ట్రిప్ వలన మీకు ఎంతో ఎనర్జీ. నిరుద్యోగులు ఉద్యోగం కొరకు మరింత కష్టపడాలి. పాత స్నేహితులను కలుస్తారు. కుటుంబ సభ్యుల కొరకు కొంత సమయం కేటాయించండి. ఆదాయం పరవాలేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

ధనస్సు రాశి : మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. లేకుంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు. భాగస్వామ్య వ్యాపారులు తమ భాగస్వాముల పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. మీ పెద్ద వారి దీవెనలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో షాపింగ్ చేస్తారు. కావాల్సినంత ధనం చేతికందుతుంది ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. మీ పిల్లలు చదువు పట్ల నిర్లక్ష్యం వహించి టీవీ మొబైల్ మీద శ్రద్ధ పెడుతున్నారు సమయాన్ని వృధా చేస్తున్నారు గమనించండి ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన మీ వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని అనుభవిస్తారు.

మకర రాశి : సహనంతో సరైన ప్రణాళికతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసులో పై అధికారుల ఒత్తిడి వలన పనుల మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు జాగ్రత్త. సరైన ప్రణాళికతో సకాలంలో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. కుటుంబంలో ఒక ఫంక్షన్ వలన అధిక ఖర్చు పెడతారు. అతిథులతో గడపడం వలన మీ పనులకు ఆటంకం. కుటుంబ సభ్యుల కొరకు కొంత సమయం కేటాయించండి వారితో ఆనందంగా గడపండి. వారు మీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం వలన మీ వైవాహిక జీవితాన్ని ఆనందించ లేక పోతున్నారు.

కుంభరాశి : కుటుంబ సభ్యులతో పరోక్షంగా మాట్లాడకండి వారు హర్ట్ అవుతారు. ఉద్యోగం మార్పుకై ప్రయత్నాలు చేస్తున్న వారు ప్రయత్నాలు వాయిదా వేయండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. బిపి తో బాధపడే వారు జాగ్రత్త వహించండి. ఆదాయం బాగుంది దానధర్మాల కొరకు కొంత భాగాన్ని కేటాయించండి దాని వలన మానసిక ప్రశాంతత. వ్యాపారస్తులకు ప్రయాణాలు దాని వలన ఇబ్బందులు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. సిగరెట్ మందులను వదిలివేయాలి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

మీన రాశి : ఈరోజు అతిగా ఊహించకండి. చేతికందిన దానితో సంతృప్తి పడండి. తోటి ఉద్యోగులతో అనవసరపు మాటల వలన ఇబ్బందులు. వ్యాపారస్తులు వీలైతే దూర ప్రయాణాలను వాయిదా వేయండి. ఈరోజు చేతికందిన ధనం వలన కొన్ని ఆదాయ సమస్యలు దూరం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. పాతబాకీలు వసూలవుతాయి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన మీ వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని అనుభవిస్తారు.