ఆదివారం పంచాంగం, రాశిఫలాలు (06-06-2021)

by  |
ఆదివారం పంచాంగం, రాశిఫలాలు (06-06-2021)
X

ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవ నామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : ఆదివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : ఏకాదశి
(నిన్న తెల్లవారుజాము 4 గం॥ 8 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 6 గం॥ 20 ని॥ వరకు)
నక్షత్రం : అశ్విని
(నిన్న రాత్రి 11 గం॥ 30 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 28 ని॥ వరకు)
యోగము : శోభనము
కరణం : బాలవ
వర్జ్యం : ( రాత్రి 9 గం॥ 58 ని॥ నుంచి 11 గం॥ 45 ని॥ వరకు)
అమ్రుత ఘడియలు : (రాత్రి 6 గం॥ 22 ని॥ నుంచి 8 గం॥ 9 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (సాయంత్రం 5 గం॥ 2 ని॥ నుంచి 5 గం॥ 54 ని॥ వరకు)
రాహుకాలం : (సాయంత్రం 5 గం॥ 9 ని॥ నుంచి రాత్రి 6 గం॥ 47 ని॥ వరకు)
గుళికకాలం : (సాయంత్రం 3 గం॥ 30 ని॥ నుంచి 5 గం॥ 8 ని॥ వరకు)
యమగండం : (ఉదయం 12 గం॥ 13 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 51 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 40 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 48 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : మేషము

మేషరాశి : నూతన వస్త్రాలు నగలు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో రోజంతా గడపటం వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. పిల్లలతో సంతోషంగా గడపటం వలన మీకు సమయం తెలియదు. కావలసినంత ధనం చేతికందుతుంది. అధిక శ్రమ వలన వెన్ను నొప్పి దానివలన అశాంతి. ఫిట్ నెస్ కొరకు యోగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. ఈ రాశి స్త్రీలకు కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో బంధువుల రాక చికాకనిపిస్తుంది.

వృషభ రాశి : సరైన కమ్యూనికేషన్ వలన మంచి అవకాశాలను అంది పుచ్చుకుంటారు. కుటుంబ వ్యక్తుల అభిప్రాయాలకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ తెలివైన నిర్ణయాలకు అందరి ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. స్థిరాస్తి అమ్మకం వలన మంచి లాభాలు వస్తాయి. ధన లాభం ఉంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అనుకోని అతిథుల రాక. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ కుటుంబంలోని ఆహ్లాదకర వాతావరణం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.

మిధున రాశి : ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంతో కాలంగా నలుగుతున్న కోర్టు కేసులో మీకు విజయం. స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయ వ్యవహారాలు బాగున్నాయి పాతబాకీలు వసూలవుతాయి. విదేశాలతో వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు అవకాశం. ఆఫీసులో అన్ని పనులు పూర్తి చేస్తారు అందరి ప్రశంసల లభిస్తాయి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి పెత్తనం చెలాయించడానికి చూడవద్దు. మీ తల్లి గారి దీవెనలు అందుతాయి. మెడిటేషన్ చేయడం వల్ల పాజిటివ్ థాట్స్ పెరుగుతాయి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

కర్కాటక రాశి : ఈరోజు అన్నివిధాలా అనుకూలమైన రోజు. దైవ సంబంధమైన కార్యాల మీద ఆసక్తి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. మీకు సంబంధం లేని విషయాల జోలికి వెళ్లి ఆవేశాలకు లోనుకాకండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. పొదుపు చేసిన డబ్బును సరైన పెట్టుబడులలో పెట్టండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపటం మీకు ఎంతో ఎనర్జీ ని ఇస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

సింహరాశి : ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. దగ్గు జలుబు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీకు బాధ్యతలు పెరుగుతాయి. కొత్తగా పెరిగిన బాధ్యతలు వలన శ్రమపడవలసి వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు ధర దగ్గర ఆగుతాయి. గందరగోళం లేకుండా మీ మైండ్ ను క్లియర్ గా ఉంచుకోండి. మీకేం కావాలో క్లియర్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశి స్త్రీలు కుటుంబ వ్యవహారాలను చాకచక్యంగా సమర్ధిస్తారు.

కన్య రాశి : సామాజిక కార్యకలాపాలలో పాల్గొంటారు ప్రముఖులతో పరిచయాలు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన రోజు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కీళ్ల నొప్పులు అధిక శ్రమ వలన మానసిక చికాకులు. ఆర్థికపరమైన విషయాలలో కావలసినంత డబ్బు చేతికి అందుతుంది. పొదుపు చేస్తారు నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఫిట్ నెస్ కొరకు యోగా మెడిటేషన్ చేయండి ఈ రాశి స్త్రీలకు మీ కుటుంబ సభ్యులు మీ విలువను పూర్తిగా తెలుసుకుంటారు.

తులారాశి : ఆశావహ దృక్పథం మరియు గట్టి ప్రయత్నాల వలన మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాలలో మీ గురువు గారి ఆశీర్వచనం లభిస్తుంది. మీ తండ్రిగారి తో ముఖ్యమైన విషయాలు మాట్లాడండి. ఆర్థిక పరంగా కావలసిన డబ్బు చేతికందుతుంది. కానీ స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బు నష్టాలను తెస్తుంది. కొంతమంది బురే నజర్ మీమీద ఉంది. జాగ్రత్తగా ఉండండి. భార్య భర్తల లో ఒకరి అనారోగ్య సమస్య మరొకరికి మానసిక అశాంతి.

వృశ్చిక రాశి : కొంత కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్య దూరమవుతుంది. సంఘంలో పేరుప్రతిష్టలు లభిస్తాయి. శత్రువులపై మీదే విజయం. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి స్థిరాస్తి అమ్మకం వల్ల లాభం. ఆఫీసు పనిలో ఏకాగ్రత లోపిస్తే తప్పులు జరుగుతాయి. సరైన ప్రణాళికతో పనులు పూర్తి చేయండి. నూతన వెహికల్ కొంటారు. వ్యక్తులకు దానం చేయటం వలన మానసిక ప్రశాంతత. బయట భోజనం కన్నా ఇంటి భోజనం మిన్న. ఈ రాశి స్త్రీలకు చిరునవ్వు, సహనం మీ ఆయుధాలు.

ధనుస్సు రాశి : పనులు సకాలంలో పూర్తి చేయడానికి అధిక శ్రమ పడవలసి వస్తుంది. వ్యర్ధ ప్రయత్నాలను చేయకండి అనుకోని ఖర్చులు వలన ఆర్థిక ఇబ్బంది. ఆఫీసు పనులు పూర్తి చేయడానికి సరైన ప్రణాళిక తప్పనిసరి. సహనంతో వ్యవహరించడం ఎంతో మంచిది. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా పిల్లలతో గడపటం ఎంతో ఎనర్జీ ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది ఉద్యోగస్తులకు జీతం ఇతర అలవెన్సులు పెరిగే అవకాశం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మిమ్మల్ని పొగడటం మరియు మీతో మనసు విప్పి మాట్లాడటం ఎంతో ఆనందం ఇస్తుంది.

మకర రాశి : మీరు కడుతున్న ఇల్లు తొందరగా పూర్తవుతుంది మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. సామాజిక కార్యకలాపాలలో మీకు గుర్తింపు. నూతన స్నేహితులు పరిచయం అవుతారు. మీరు చేస్తున్న యోగా మెడిటేషన్ వల్ల మానసిక శారీరక ఆరోగ్యం. ఆఫీసులో పనులను ఎంతో చాకచక్యంగా పూర్తిచేస్తారు. మీ అవసరాలకు తగిన ధనం లభిస్తుంది. ఖర్చులను తగ్గించుకోండి మిగతాది పొదుపు చేయండి. ఆకర్షణీయమైన పథకాలలో పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపక పోవటం మీకు అశాంతి నిస్తుంది.

కుంభరాశి : ఈరోజు మీరు ప్రపంచం మొత్తాన్ని వదిలి వేస్తారు. ఒంటరిగా గడపటాన్ని ఎంతో ఇష్టపడతారు. మీ బంధువులు మిత్రులు సోదరులు అందరూ మీకు సహాయం చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొందరికి విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు సఫలమౌతాయి. ఆఫీసు పనిలో మీ సామర్థ్యానికి ప్రశంసలు లభించటం మీకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆర్థిక విషయాలలో పురోగతి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది ఎంతో ఆనందిస్తారు.

మీన రాశి : ఆర్థిక పరమైన విషయాలు ఎంతో మెరుగు పడతాయి. పాత బాకీలను తీర్చివేస్తారు. మీ మాటలను అదుపులో పెట్టుకోండి. దీనివలన సంఘంలో మీకు అప్రతిష్ట. ఆఫీసులో కొత్త బాధ్యతల వలన ఎంతో శ్రమ. ముఖ్యమైన విషయాలలో తెలివైన నిర్ణయం ఆలోచించి తీసుకోండి. ఇంటి మరమ్మతులకు ఖర్చు చేయవలసి వస్తుంది. కొంతమంది నూతన గృహం కట్టడం ప్రారంభిస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త స్నేహపూర్వకంగా మాట్లాడడం పాత విషయాలను మర్చిపోయేలా చేస్తుంది.


Next Story