ఆదివారం పంచాంగం, రాశిఫలాలు (30-05-2021)

by  |
ఆదివారం పంచాంగం, రాశిఫలాలు (30-05-2021)
X

ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : ఆదివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : పంచమి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 6 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 15 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాషాఢ
(నిన్న రాత్రి 6 గం॥ 10 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 4 గం॥ 47 ని॥ వరకు)
యోగము : శుక్లము
కరణం : బాలవ
వర్జ్యం : (తెల్లవారు జాము 1 గం॥ 42 ని॥ నుంచి 3 గం॥ 12 ని॥ వరకు)(రాత్రి 8 గం॥ 41 ని॥ నుంచి 10 గం॥ 14 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఉదయం 10 గం॥ 45 ని॥ నుంచి 12 గం॥ 15 ని॥ వరకు)
దుర్ముహూర్తం : ( సాయంత్రం 5 గం॥ 1 ని॥ నుంచి 5 గం॥ 53 ని॥ వరకు)
రాహుకాలం : (సాయంత్రం 5 గం॥ 7 ని॥ నుంచి రాత్రి 6 గం॥ 45 ని॥ వరకు)
గుళికకాలం : (సాయంత్రం 3 గం॥ 29 ని॥ నుంచి 5 గం॥ 7 ని॥ వరకు)
యమగండం : (ఉదయం 12 గం॥ 13 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 51 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 46 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : మకరం

వృషభ రాశి : యోగ, మెడిటేషన్ లేక ఏదైనా ఆట ఆరోగ్యపరంగా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. దైవ ప్రార్థనల వలన మంచి ఆలోచనలు వస్తాయి. ఇంటి కొనుగోలుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. డబ్బును అత్యవసర ఖర్చులకు మాత్రమే పెట్టండి. పొదుపు చేయండి. మీ పిల్లలతో గడపటం మీకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇంటిలో పెద్దవారికి అనారోగ్య సూచనలు జాగ్రత్త వహించండి. ఈ రాశి స్త్రీలకు మానసిక ప్రశాంతత కోసం ఒంటరిగా గడపాలనిపిస్తుంది.

మేష రాశి : వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తుల గురించి శుభవార్త అందుతుంది. ఇతరులను విమర్శించడం ఆరోగ్యానికి హానికరం. కుటుంబ వ్యవహారాలలో గొడవలను చాకచక్యంగా పరిష్కరిస్తారు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అందరి మెప్పు పొందుతారు. ఆదాయ వ్యవహారాలు బాగున్నాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలు ఇంటిని సుందరంగా అలంకరించడంలో నిమగ్నమవుతారు.

మిధున రాశి : సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం మీకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. కొంతమందికి ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఆశాజనకం. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థికపరమైన ఇబ్బంది లేదు మీ అవసరాలకు తగిన ఖర్చు చేస్తారు. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. కొత్త పెట్టుబడులకు కావలసిన డబ్బు సమకూరుతుంది. మిగిలి ఉన్న సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు పూర్తి ఆనందకరమైన రోజు.

కర్కాటక రాశి : సంఘంలో పేరుప్రతిష్టలు వస్తాయి. గుడులను సందర్శిస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు శ్రమను కలిగిస్తాయి ఓర్పుతో పనులు పూర్తి చేయండి. ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకున్నా ఖర్చులు మీ చేయి దాటి పోతున్నాయి. ఆధ్యాత్మికత విషయంలో గురువు లేక ఇంటిలోని పెద్ద వారు మీకు తగిన సలహాలు ఇస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అధిక శ్రమ వలన కాలు నొప్పి బాధ పెట్టొచ్చు. ఈ రాశి స్త్రీలకు ఇంటిలో పిల్లల వ్యవహారాలు మిమ్మల్ని కఠినంగా ప్రవర్తించేలా చేస్తాయి.

కన్యారాశి : కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడం మీకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. ఫిట్ నెస్ కొరకు యోగ, మెడిటేషన్ చేయండి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మీ పిల్లల ప్రగతి మీకెంతో గర్వ కారణం అవుతుంది. అద్భుతమైన భవిష్యత్తు కొరకు సరైన ప్రణాళికలు వేసుకొండి. ఆదాయం బాగుండడం వలన ఖర్చులు ఇబ్బంది పెట్టక పోవచ్చు. ఈ రాశి స్త్రీలకు దైవప్రార్థన వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.

సింహరాశి : కొన్ని మార్పులు జరుగుతాయి. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు చేస్తారు. ఇష్టం లేకున్నా ప్రయాణం చేయవలసి రావచ్చు. ఫిట్ నెస్ కొరకు యోగా మెడిటేషన్ చేయండి. కొంతమందికి కాలు నొప్పి బాధించవచ్చు. ఆస్తి తగాదాల లో పరిష్కార సూచనలు. వ్యాపారస్తులకు లాభాలను తెచ్చి పెట్టే రోజు. మీ ఖర్చులను బేరీజు వేసుకోండి. అనవసర దుబారా ఖర్చులను నివారించండి. బంధువులు లేక మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఈ రాశి స్త్రీలకు మీకు అందరి ప్రశంసలు లభిస్తాయి.

తులారాశి : నూతన గృహ నిర్మాణం లేక కొనుగోలుకు సంబంధించి శుభవార్త అందుతుంది. ఉద్యోగంలో పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి అనుకున్న పనులను పూర్తిచేస్తారు. ఆదాయ వ్యవహారాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తొలగి అందరూ ఆనందంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన విషయం మీకు అనుకూలం. ఉద్యోగంలో మీకు ఉన్న పలుకుబడి మరింత గట్టిపడుతుంది. సరైన భోజనము మిమ్మల్ని మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రయాణాలు అత్యవసరం అయితేనే చెయ్యండి. ఈ రాశి స్త్రీలకు చిన్ననాటి స్నేహితుల రాకతో సమయం ఇట్టే గడిచిపోతుంది.

వృశ్చిక రాశి : దీర్ఘకాలిక పెట్టుబడులు వలన అధిక లాభాలు. బాధ్యతలు పెరుగుతాయి. మీ సహనాన్ని అలుసుగా తీసుకునే వారికి సరైన సమాధానం ఇవ్వండి. కుటుంబ అవసరాల కోసం ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో కావలసినంత సమయం గడపలేక పోవటం మీకు అశాంతి నిస్తుంది. తక్కువ నిద్ర వలన శారీరక అలసట. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారంలో భాగస్వాములతో గొడవలు రాకుండా వారితో చర్చలు చెప్పండి.ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

ధనుస్సు రాశి : అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. భూముల కొనుగోలు గురించి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆరోగ్యం పూర్తిగా చక్కబడుతుంది. నచ్చిన దేవుడి పాటలను వినటం వలన మానసిక ప్రశాంతత. మీ శత్రువుల మీద విజయం సాధించడం మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఉద్యోగంలో తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. డబ్బు పెట్టుబడులను వాయిదా వేయండి. కుటుంబంలోని పెద్దవారి అనారోగ్యం వలన డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. ఈ రాశి స్త్రీలకు మీరు మీ సమస్యల గురించి ఆయనతో చెబుదాం అనుకుంటే ఆయన తన సమస్యల గురించి చెప్పడం వల్ల మరింత విచారం.

మకర రాశి : నెగెటివ్ థాట్స్ మీకు అనారోగ్యం తెచ్చి పెట్టకముందే వాటిని వదిలేయండి. దానం చేయటం వలన మరియు ఇతరులకు సహాయం చేయడం వల్ల మీ దృక్పథంలో మార్పు వస్తుంది. ఒకే రకమైన పనుల కన్నా మార్పులను ప్రయత్నించండి. ఉద్యోగ పరంగా ప్రయాణాలు ఉండవచ్చు. ఎంతో కాలం నుంచి మాట్లాడదామని అనుకుంటున్న స్నేహితునితో మాట్లాడతారు. ఈ రాశి స్త్రీలకు పిల్లల పట్ల మీ కఠిన ప్రవర్తన వారిని బాధిస్తుంది.

కుంభరాశి : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులు నిరుద్యోగులు ఇంకొంచెం శ్రద్ధ పెడితే మీరు అనుకున్న గోల్ సాధిస్తారు. కొన్ని మార్పులు మిమ్మల్ని ఉద్వేగానికి గురి చేస్తాయి. డబ్బు సంపాదన లో ఆరి తేరతారు. స్థిరాస్తి వ్యవహారాలలో మీ సొంత నిర్ణయం మాత్రమే తీసుకోండి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. డబ్బు, వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాల వలన ఆరోగ్యం పద్ధతిలో ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు బంధువుల రాక ఈ కరోనా సమయంలో చికాకనిపిస్తుంది.

మీన రాశి : ఆర్థిక విషయాలు ఇబ్బంది పట్టక పోవచ్చు కానీ డబ్బును అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. పాత బకాయిలు వసూలవుతాయి. ఆఫీసులో పని సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు కలిగే అవకాశం. ఒక శుభవార్త ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.ఈ రాశి స్త్రీలకు మీరు కుటుంబ వ్యవహారాలలో చూపిస్తున్న శ్రద్ధ కుటుంబ సభ్యులకు అందరికీ ఆనందం ఇస్తుంది.


Next Story

Most Viewed