ఆదివారం పంచాంగం, రాశిఫలాలు (16-05-2021)

by  |
ఆదివారం పంచాంగం, రాశిఫలాలు (16-05-2021)
X

ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : ఆదివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : చవితి
(నిన్న ఉదయం 8 గం॥ 0 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 9 గం॥ 59 ని॥ వరకు)
నక్షత్రం : ఆరుద్ర
(నిన్న ఉదయం 8 గం॥ 39 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 11 గం॥ 12 ని॥ వరకు)
యోగము : శూలము
కరణం : భద్ర (విష్టి)
వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు : ( తెల్లవారు జాము 00 గం॥ 8 ని॥ నుంచి 1 గం॥ 54 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (సాయంత్రం 4 గం॥ 56 ని॥ నుంచి 5 గం॥ 47 ని॥ వరకు)
రాహుకాలం : (సాయంత్రం 5 గం॥ 2 ని॥ నుంచి రాత్రి 6 గం॥ 39 ని॥ వరకు)
గుళికకాలం : (సాయంత్రం 3 గం॥ 25 ని॥ నుంచి 5 గం॥ 2 ని॥ వరకు)
యమగండం : (ఉదయం 12 గం॥ 11 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 48 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 43 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 40 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : మిథునము

మేష రాశి : ఎంతోకాలం నుండి రాకుండా ఇబ్బంది పెడుతున్న ధనం చేతికందుతుంది. మీ కుటుంబ సభ్యులతో మీ కష్టాలను బాధలను పంచుకోండి దానివల్ల మీకు ఎంతో మనశాంతి. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనే మీ వాదన పూర్తిగా తప్పు అని నిరూపణ అవుతుంది. వ్యాపార వ్యవహారాలలో పైన వలన బంధువులను దూరంగా ఉంచి లాభ పడతారు. ఈ రాశి స్త్రీలకు అవకాశవాదులు మళ్లీ దరిచేరతారు. వారిని దగ్గరకు రానీయకండి.

వృషభ రాశి : స్త్రీ మూలకంగా ధన లాభం కలిగే అవకాశం. మీ పిల్లల అభివృద్ధిని సమాజం గుర్తించినందుకు మీకు ఎంతో ఆనందం. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త మంచిది కాదు. సమాజంలోని వ్యక్తుల ప్రవర్తన మీకు ఎంతో బాధ కలిగిస్తుంది. దూరపు బంధువుల రాక ఆనందాన్నిస్తుంది. ఈ రాశి స్త్రీలకు కరోనా సమయంలో నమ్మకమైన పని వారు దొరకడం కష్టం అవుతుంది.

మిధున రాశి : ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని అంతిమ నిర్ణయం మీరు తీసుకోండి మంచి జరుగుతుంది. మీ భార్య లేక భర్త తో వాదోపవాదాల లో వారిని నిందించకండి. ఓర్పు సహనము చాలా ముఖ్యమని గ్రహించండి. వైద్యం కోసం ధనము ఖర్చు పెట్టే అవకాశం. ఈ రాశి స్త్రీలకు నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం

కర్కాటక రాశి : ఈ కరోనా సమయంలో వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమ ఒత్తిడి కలిగి ఉంటారు. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని అందరూ స్వంత వ్యక్తిగా భావిస్తారు.
అనాలోచిత నిర్ణయాలు తీసుకొని మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టకండి. వ్యాపారంలో మీ స్వంత బంధువర్గం నుండి కావలసిన సహాయం అందుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం. ఈ రాశి స్త్రీలు వ్యాపార పరంగా వచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.

సింహరాశి : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ధనం వచ్చే అవకాశం. కుటుంబ సభ్యులతో ప్రతి సమస్యను సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకోండి. వారిని బాధ పెట్టకండి కోపతాపాలు వల్ల అంతిమంగా మీరు నష్టపోతారు. ఈ రాశి స్త్రీలకు అవకాశవాదులు తిరిగి మీ దగ్గరకు చేరారు జాగ్రత్తగా వారిని వదిలించుకోండి.

కన్య రాశి : ఈ కరోనా ఈ సమయంలో ప్రజా సంబంధాలు జాగ్రత్తగా నడపటం కష్టతరమవుతుంది. మీ శత్రువులు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి దెబ్బతింటారు. ధర్మకార్యాలు కై ధనము ఖర్చు చేస్తారు. ఈ రాశి స్త్రీలు అయిన వారికి అంతో ఇంతో సహాయం చేస్తారు.

తులారాశి : కావలసిన ధన సహాయం చేతికందుతుంది. కుటుంబంలోని ఒక వ్యక్తితో వాదోపవాదాలకు దిగే అవకాశం. సహనంతో వ్యవహరించండి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇతరులకు సంబంధించిన తగాదాల లో తలదూర్చి వద్దు. ఈ రాశి స్త్రీలకు పోటీ పరీక్షలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు.

వృశ్చిక రాశి : ఆర్థికంగా ఎదుటి వారికి సహాయం చేయడం కూడా సమస్యలకు కారణమవుతుంది. జాగ్రత్తపడండి. సంసార జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకుంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ పిల్లల అభివృద్ధి మీకు ఎంతో సంతోషకరం అవుతుంది. ధనం విషయంలో జీవిత భాగస్వామితో వివాదాలు ఉండవచ్చు జాగ్రత్తగా వ్యవహరించండి.

ధనుస్సు రాశి : ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా వాటిని దాటుకొని ముందుకు వెళ్తారు. శారీరక రుగ్మతల కన్నా మానసిక రుగ్మతలు చాలా ప్రమాదకరం అని గ్రహిస్తారు. మీ నిజాయితీ ప్రవర్తన అందరినీ మెప్పిస్తుంది. చేస్తున్న వ్యవహారములు కలిసి వచ్చును. ఈ రాశి స్త్రీలకు మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మీ మీద పెత్తనం చేద్దామనుకునే స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

మకర రాశి : ఆడంబరాలకు అవసరం లేని ఖర్చులకు దూరంగా ఉండండి. ఎందుకంటే సంపాదన బాగున్నా ఖర్చులను పెంచటం వల్ల ధనమును నిల్వ చేయలేరు. మీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి మీ మాటలు వారిని ఇబ్బంది పెట్టవచ్చు. సరి అయిన వేళ లో భోజనం లేకపోవడం వలన కోపం వచ్చే అవకాశం. ఈ రాశి స్త్రీలకు సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు.

కుంభరాశి : లేనిపోని భయాల వల్ల వచ్చిన అవకాశాలను దూరం చేసుకోకండి. ముఖ్యులతో సంప్రదించండి. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు మీకు మంచి ఫలితాలను తీసుకొని వస్తాయి. మీకు ఇష్టం లేని వ్యక్తులతో సంభాషించ వలసి రావచ్చు. అది మీకు మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఈ రాశి స్త్రీలకు సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు.

మీన రాశి : మిమ్ములను మీరు ప్రశాంతంగా ఉంచుకోండి నిరాశకు లోను కావద్దు. దైవ ధ్యానం మీకు ఎంతో మేలు చేస్తుంది. కుటుంబ అవసరాలను గమనించండి వారితో సర్దుకోండి. సంతానము యొక్క యోగక్షేమాల పైన శ్రద్ధ పెడతారు. అందరి మన్ననలు పొందుతారు. ఈ రాశి స్త్రీలకు ఇచ్చిన మాట తప్పే వంచకులతో జాగ్రత్తగా వ్యవహరించండి.


Next Story