ఆదివారం పంచాంగం, రాశిఫలాలు (25-04-2021)

by  |
Panchangam Rasi phalalu
X

శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి : త్రయోదశి మ 2.14
తదుపరి చతుర్థశి
వారం : ఆదివారం (భానువాసరే)
నక్షత్రం : హస్త రా 12.47
తదుపరి చిత్త/చిత్ర
యోగం : వ్యాఘాతం ఉ 6.19
తదుపరి హర్షణం తె 3.37
కరణం : తైతుల మ 2.14
తదుపరి గరజి రా 2.06
ఆ తదుపరి వణిజ
వర్జ్యం : ఉ 9.56 – 11.28
దుర్ముహూర్తం : సా 4.32 – 5.22
అమృతకాలం : రా 7.04 – 8.35
రాహుకాలం : సా 4.30 – 6.00
యమగండం/కేతుకాలం : మ 12.00 – 1.30
సూర్యరాశి : మేషం || చంద్రరాశి : కన్య
సూర్యోదయం : 5.42 || సూర్యాస్తమయం : 6.13

మేషం : దూర ప్రాంత బంధు మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. సమాజంలోప్రముఖుల పరిచయాలతో కీలకమైన పనులు పూర్తిచేస్తారు. నూతనవ్యాపారాలకు శ్రీకారం చుడతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది.

వృషభం : కుటుంబ సంబంధిత బాధ్యతలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆరోగ్యవిషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి .నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కీలక విషయాలలో ఆలోచనలు స్థిరత్వం లోపిస్తుంది.

మిధునం : అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.మాతృ సంభందీకులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార నష్ట సూచనలున్నవి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి మిత్రులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

కర్కాటకం : ఉద్యోగమున పని ఒత్తిడి నుండి బయట పడతారు. బంధు, మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం : ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు ఉంటాయి. సోదరులతో భూ సంబంధిత వివాదాలు ఉంటాయి. ధన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. నేత్ర సమస్యలు కలుగుతాయి.

కన్య : గృహమున దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తిఅవుతాయి. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘ కాలిక ఋణాలు తీర్చగలుగుతారు.

తుల : గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి ఇంటాబయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.

వృశ్చికం : కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా వ్యవహారాలు మరింత సంతృప్తి కలిగిస్తాయి. ఆప్తుల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి,ఉద్యోగాల్లో ఉత్సహంగా సాగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.

ధనస్సు : రావలసిన మొండి బాకీలు వసూలు అవుతాయి. సేవ కార్యక్రమాలు నిర్వహించి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి,ఉద్యోగాలలోఅనుకూలత పెరుగుతుంది. గృహమున వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.

మకరం : ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

కుంభం : నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది దూరా ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక ఇబ్బందు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది.

మీనం : ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు. చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల తొలగుతాయి. ఆర్ధిక విషయంలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. వ్యాపారపరంగా పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్సనం చేసుకుంటారు.


Next Story