ఆదివారం పంచాంగం, రాశిఫలాలు (04-07-2021)

by  |
ఆదివారం పంచాంగం, రాశిఫలాలు (04-07-2021)
X

ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : ఆదివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : దశమి (నిన్న సాయంత్రం 5 గం॥ 34 ని॥ నుంచి రాత్రి 7 గం॥ 57 ని॥ వరకు)
నక్షత్రం : అశ్విని (నిన్న ఉదయం 6 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 6 ని॥ వరకు)
యోగము : సుకర్మము
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 37 ని॥ నుంచి ఉదయం 6 గం॥ 24 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 7 గం॥ 57 ని॥ నుంచి రాత్రి 9 గం॥ 45 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 2 ని॥ నుంచి తెల్లవారుజాము 2 గం॥ 49 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 8 ని॥ నుంచి రాత్రి 6 గం॥ 0 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 15 ని॥ నుంచి రాత్రి 6 గం॥ 53 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ నుంచి సాయంత్రం 5 గం॥ 14 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 19 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 57 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 46 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 54 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : మేషము

మేష రాశి : సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. నిరాశావాదం వదిలిపెట్టండి ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధించడానికి ప్రయత్నించండి. ఆడంబరాల కోసం అట్టహాసంగా ఇంట్లో చేసిన ఒక ఫంక్షన్ కు చాలా ఖర్చు అవుతుంది. ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి దానివలన అందరికీ ఆనందం. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

వృషభ రాశి : కుటుంబ సభ్యుల కొరకు కొంత సమయం కేటాయించండి వారితో గడపటం వలన మీకు ఎంతో ఎనర్జీ. సకాలంలో పనులు చేయటం వలన ఇబ్బందుల నుండి తప్పించుకుంటారు. తోటి ఉద్యోగుల సహాయం తీసుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఫిట్ లెస్ కొరకు సరైన వేళకు సరైన భోజనం చేయండి. శుభవార్త అందుతుంది దానివలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. విద్యార్థులకు టీవీ మొబైల్ వాడకం వలన సమయం వృధా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపడం లేదని మానసిక వేదన.

మిధున రాశి : ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. వివాదంలో ఉన్న స్థిరాస్తి వ్యవహారం కోర్టు కు వెళుతుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. మీ ఆలోచనలకు సరైన ప్రణాళిక తోడైతే విజయం మీదే తొందరపాటు నిర్ణయాల వలన జీవితాంతం బాధపడాల్సి వస్తుంది సహనంతో ఆలోచించండి. బంధువులు ఇంటికి వస్తారు. ఆఫీసులో మీ పని సామర్థ్యం పై అందరి ప్రశంసలు ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరినొకరు తప్పులు పట్టుకోవటం మానేయండి.

కర్కాటక రాశి : గమ్యాన్ని చేరుకోవాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఫిట్నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆదాయ పరమైన కొత్త ఒప్పందం వల్ల అధిక లాభాలు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. వారితో పరుషంగా మాట్లాడకండి వారు హర్ట్ అవుతారు. మీ గురించి మీరు ఆలోచించుకోండి. చెడు అలవాట్లను వదిలి వేయండి. దుబారా ఖర్చులు నివారించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

సింహరాశి : ఈరోజు మీ సహనానికి పరీక్ష. ఆశావహ దృక్పథం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక మార్గం వైపు ఆసక్తి కనబరుస్తారు. మెడిటేషన్ ఒక మంచి ఉపాయం ఫిట్నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. అనవసరపు ఖర్చు ల వలన మీ బడ్జెట్ తారుమారయ్యే అవకాశం. కొంతమందికి విదేశయాన ప్రయత్నాలు సఫలం. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి ఒత్తిడి వలన తలనొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

కన్యారాశి : పరిస్థితులను బట్టి సర్దుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ప్రతి పని ఆలస్యం అవటం వలన మనోవేదన. దాన ధర్మాల వలన మానసిక ప్రశాంతత. ఆఫీసులో అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ. మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం మానేయండి. ప్రయాణాలలో వస్తువులు డబ్బు జాగ్రత్త. ఒత్తిడి వల్ల తలనొప్పి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోండి. మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.

తులారాశి : సంఘంలో పేరుప్రతిష్టలు. ఇతరుల నుంచి బహుమానాలు అందుకుంటారు. కొంతమంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఫిట్నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఆత్మీయుల సలహా వలన ఆదాయ పరమైన వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. తోటి ఉద్యోగులతో పరుషంగా మాట్లాడకండి. దాని వలన గొడవలు చాలా దూరం వెళతాయి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలు మరిచిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.

ధనుస్సు రాశి : ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంలో కలతలు మానసిక వేదనకు గురి చేస్తాయి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి వారితో కఠినంగా వ్యవహరించండి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

వృశ్చిక రాశి : మానసిక ఆరోగ్యం మెరుగు పడాలంటే చిరునవ్వుతో రోజును ప్రారంభించండి. పట్టుదలతో కార్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి వారితో కొంత సమయం గడపండి దాని వలన మీకు ఎంతో ఎనర్జీ. వివాహం కాని వారికి సంబంధం కుదిరే అవకాశం. కావాల్సిన ప్రధానం చేతికందుతుంది పొదుపు చేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు మీ వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని చవి చూడాలి అంటే ఏం చేయాలో తెలుసుకుంటారు.

మకర రాశి : ఆత్మవిశ్వాసం కోల్పోవడం వలన సరైన నిర్ణయాలు తీసుకోలేరు. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు తమ ఆదాయ వ్యవహారాలను జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఫిట్నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. కొత్తగా పెళ్లి అయిన వారు తమ అహంభావాన్ని వదిలి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్థిరాస్తి వ్యవహారాలు మీకు అనుకూలం. ఆఫీసు పనులలో అధిక శ్రమ వలన తప్పులు జరిగే అవకాశం. సరైన ప్రణాళికతో పనులు పూర్తి చేయండి ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క మొరటుతనం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

కుంభరాశి : సరైన వేళకు సరైన భోజనంతో ఫిట్ నెస్ ను సాధిస్తారు. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు లాభాలు వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి వారితో పరుషంగా మాట్లాడకండి. అనవసరపు బాతాఖానీ ల వలన సమయం వృధా ఆఫీసులో పనులు పూర్తి కావు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

మీన రాశి : ఫిట్ నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల అవసరాలను గమనించండి వారితో కొంత సమయం గడపండి దాని వలన మీకు ఎంతో ఎనర్జీ. ఆఫీసు పనులలో అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ. తోటి ఉద్యోగుల సహాయం తీసుకోండి. అనవసరపు ఖర్చులు వలన డబ్బుకు ఇబ్బంది. అధిక శ్రమ వలన కడుపు నొప్పి. ఈ రాశి స్త్రీలు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోయి ఒక ఆనందకరమైన రోజును గడుపుతారు.

Next Story

Most Viewed