ఇండియన్స్‌కు ప్రత్యర్థి జట్టులో వాషింగ్టన్ సుందర్, ఆవేశ్ ఖాన్

by  |
ఇండియన్స్‌కు ప్రత్యర్థి జట్టులో వాషింగ్టన్ సుందర్, ఆవేశ్ ఖాన్
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడటానికి టీమ్ ఇండియా వెళ్లిన సంగతి తెలిసిందే. అగస్టు 4 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండగా అంతకు ముందు భారత జట్టు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడటానికి నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మంగళవారం నుంచి చెస్టర్ లీ స్ట్రీట్‌లోని రివర్ సైడ్ గ్రౌండ్‌లో ఇండియన్స్ ఎలెవన్ జట్టు కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్‌తో తలపడుతున్నది. అయితే భారత క్రికెటర్లు వాషింగ్టన్ సుందర్, ఆవేశ్ ఖాన్ కూడా ఈ మ్యాచ్ ఆడుతున్నారు. కానీ అనూహ్యంగా వీళ్లు ఇండియన్స్ తరపున కాకుండా కౌంటీ సెలెక్ట్ జట్టు తరపున బరిలోకి దిగారు. వాషింగ్టన్ సుందర్‌కు బౌలింగ్ చేసే అవకాశం రాకపోయినా.. ఆవేశ్ ఖాన్ మాత్రం బౌలింగ్ చేశాడు. రిజర్వ్ బౌలర్‌గా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ఆవేశ్ ఖాన్ ప్రత్యర్థి జట్టు తరపున ఆడుతుండటం విశేషం. ఈ మ్యాచ్‌ నుంచి కెప్టెన్ కోహ్లీ, అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమిలకు విశ్రాంతి ఇచ్చారు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. మయాంక్ అగర్వాల్, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, హనువ విహారికి జట్టులో స్థానం దక్కింది.

Next Story

Most Viewed