కరాటే నేర్చుకోండి.. విద్యార్థులకు హీరో సుమన్ పిలుపు

by  |
Hero Suman
X

దిశ, ఫరూక్‌నగర్: ఆత్మ రక్షణకు కరాటే విద్య ఎంతో అపరమైన శక్తినీ, ఆత్మ స్థైర్యాన్నీ నింపుతుందని సినీ హీరో సుమన్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో చిల్డ్రన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, యాదవ్ బూడో ఖాన్ కరాటే క్లబ్ ఇంటర్నేషనల్ ‘20 వసంతాల వేడుక’కు ప్రముఖ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలోని రాణి పాఠశాలలో కరాటే మాస్టర్ మల్లేష్ ఆధ్వర్యంలో నైపుణ్యం కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేశారు.

ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. తనను తాను రక్షించుకుంటూ ఇతరులను రక్షించడానికి కరాటే ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే, గ్రామస్థాయిలో కరాటే నేర్చుకునేలా చైతన్యవంతం చేయాలని సూచించారు. ఈ వేడుకలో కాంగ్రెస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్, మల్లేష్ యాదవ్, గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed