నవ్వులు పంచుతున్న ‘సుమక్కతో సుధీర్’

by  |
నవ్వులు పంచుతున్న ‘సుమక్కతో సుధీర్’
X

దిశ, వెబ్‌డెస్క్ : గ్యాప్ లేకుండా పంచ్‌లు వేసేది ఒకరైతే.. ఆ పంచులకు అమాయకంగా ముఖం పెడుతూ, బిత్తర చూపులతో నవ్వించేది మరొకరు. అలా అని.. సైలెంట్‌ కాదు, అతడు పులిహోర రాజానే. వాళ్లే ఒకరు ప్రముఖ యాంకర్ సుమక్క అయితే, మరొకరు.. కామెడీ కింగ్ సుడిగాలి సుధీర్. మరి వీరిద్దరూ కలిస్తే.. డబుల్ కామెడీ పక్కా కదా. దసరా ముందు సుమ, సుధీర్‌లు ఆ సందడినే తీసుకొచ్చారు. సుమ తన యూట్యూబ్ చానెల్‌లో ‘ఈట్ టాక్ విత్ సుమక్క’ అని ప్రత్యేక కార్యక్రమాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి సంబంధించి ఇటీవలే సుమ, సుధీర్‌ల ప్రోమో విడుదల కాగా, ప్రస్తుతం పూర్తి కార్యక్రమాన్ని విడుదల చేసినట్లు సుమ తన ఇన్‌స్టా వేదికగా తెలియజేసింది.

‘హాయ్.. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ పండగని మరింత స్పెషల్‌గా చేయడానికి మీ ముందుకొచ్చేశాం. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియోతో.. అదే ‘సుడిగాలి సుధీర్ ఈట్ టాక్ విత్ సుమక్క’ అని ఇన్‌స్టాలో పేర్కొంది. ఇక కార్యక్రమం విషయానికొస్తే.. సుమ ముందుగా సుధీర్‌ను మాట్లాడానికి అస్సలు టైమ్ ఇవ్వకుండా.. ఇంట్రోలోనే పంచులతో లాగేసింది. ఇక సుధీర్ తన కెరీర్ బిల్డప్ చేసుకున్న విధానాన్ని అప్రిషియేట్ చేసింది. ఇక సిగ్గుగా ఉందా.. వార్మప్ కావాలా అంటూ సుధీర్‌పై పంచులేసింది. ఇక సుధీర్ ఏది బాగా చేస్తాడు? చెప్పండమ్మా అని సుమ అడగ్గానే.. పులిహోర అనే వాయిస్ ఓవర్ వినిపించింది. దానికి సుధీర్.. పులిహోర ఏంటి మేడం! అని అదో రకమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఈ రోజు మనం ‘సుధీర్.. పులిహోర తయారు చేసే విధానం తెలుసుకుందాం’ అని సుమక్క అనే స్టైల్‌కు సుధీర్ అలా చూస్తూ ఉండిపోయాడు. అన్ని నిమ్మకాయలు ఎందుకు.. ఓ అంతమందికి నువ్వు పులిహోర కలుపుతావా! అంటూ.. సుమ అడగ్గానే సుధీర్ మళ్లీ సిగ్గుపడిపోయాడు. సుధీర్ ఇన్నిన్ని పెళ్లిళ్లు.. పెళ్లి కాకుండానే నీకు మాత్రం జరిగాయాయి కదా! అని సుమ అడగడం కూడా నవ్వు తెప్పించింది. ఇలా షో ఆద్యంతం నవ్వులు పంచింది.


Next Story

Most Viewed