సుశాంత్‌.. ‘సూసైడ్ ఆర్ మర్డర్’

by  |
సుశాంత్‌.. ‘సూసైడ్ ఆర్ మర్డర్’
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యా? లేక హత్యా?.. ఆత్మహత్యే అయితే అలా ఎందుకు చేసుకున్నాడు.. నెపోటిజమే కారణమా? తన ఎక్స్ మేనేజర్ దిశ విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల.. సూరజ్ పంచోలి, సల్మాన్ ఖాన్, మహేశ్ భట్‌ల ఒత్తిడే సుశాంత్ ఆత్మహత్యకు దారి తీసిందా? లేక నెపోటిజం గురించి ప్రశ్నిస్తున్న సుశాంత్‌ను టార్గెట్ చేసి.. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌చే తనను మర్డర్ చేయించారా? ఇలా సుశాంత్ మరణంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండగా.. బోలెడన్ని అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ అనుమానాలకు నివృత్తి కలిగిస్తూ ఓ సినిమా తెరకెక్కుతోంది. ధోని బయోపిక్‌లో నటించిన ‘సుశాంత్’ బయోపిక్ తెరమీదకొస్తోంది. టిక్ టాక్ స్టార్, సుశాంత్ డూప్ సచిన్ తివారిని ఇంట్రడ్యూస్ చేస్తూ.. సూసైడ్ ఆర్ మర్డర్ పేరుతో సుశాంత్ జీవితం తెరకెక్కుతోంది. విజయ్ శేఖర్ గుప్తా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్‌గా ఉండగా.. సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అంతేకాదు క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Next Story

Most Viewed