- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం: ప్రేమజంట ఆత్మహత్య
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామం సైదాపూర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతులు మోస్రా మండలం తిమ్మాపూర్‌కి చెందిన మోహన్, లక్ష్మిగా గుర్తించారు. గత మే నెల 14వ తేదీన అదృష్యమైన వీరు.. వారం క్రితమే ఆత్మహత్య చేసుకునట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. […]</p>

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామం సైదాపూర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతులు మోస్రా మండలం తిమ్మాపూర్‌కి చెందిన మోహన్, లక్ష్మిగా గుర్తించారు. గత మే నెల 14వ తేదీన అదృష్యమైన వీరు.. వారం క్రితమే ఆత్మహత్య చేసుకునట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలు చెట్టుకు వెళాడుతూ.. కుళ్లిపోయి ఉన్నట్లు వెల్లడించారు.
మోహన్, లక్ష్మిల ప్రేమకు ఇరువురి కులాలు వేరు కావడమే కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేగకాండా.. లక్ష్మి కుటుంబం కొన్నిరోజుల క్రితమే బోధన్ కోమాన్‌పల్లికి వలస వెల్లినట్లు గుర్తించారు. అయితే.. లక్ష్మికి ఇటీవల పక్క గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఈ క్రమంలో హార్వెస్టర్ డ్రైవర్‌గా పనిచేసే మోహన్ లక్ష్మి కీ చెంతనే ఉన్నా గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. ఇష్టంలేని పెళ్లిచేయడంతో తాను ప్రేమించిన మోహన్‌తో వెళ్లిపోయినట్టు వర్నీ పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.






