- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్య
<p>దిశ, మెదక్: కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సూర లింగం, కనకవ్వలకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో కుటుంబంలో ఏర్పడిన కలహాల కారణంగా మనస్తాపం చెందిన కూతురు కళ్యాణి(18) పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చేర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ్నుంచి సిద్దిపేట జిల్లా […]</p>
దిశ, మెదక్: కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సూర లింగం, కనకవ్వలకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో కుటుంబంలో ఏర్పడిన కలహాల కారణంగా మనస్తాపం చెందిన కూతురు కళ్యాణి(18) పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చేర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ్నుంచి సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే కళ్యాణి మృతిచెందింది. సమాచారం అందుకున్న చేర్యాల ఎస్సై మోహన్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Tags: Suicide, young woman, family strife, medak, siddipet, cheryala






