- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మను, అన్నను జాగ్రత్తగా చూసుకో.. నేను చనిపోతున్న మామ..!
<p>దిశ, గండీడ్: ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెట్టడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గండీడ్ మండలం వెన్నాచేడ్‌లో ఈ ఘటన జరిగింది. ఇదే గ్రామానికి చెందిన చెవిటి కృష్ణయ్య (21) తల్లి, అన్నతో కలిసి నివాసం ఉంటున్నాడు. గత కొన్నేండ్ల క్రితం తండ్రి చనిపోయాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి ఇబ్బందిగా మారడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కృష్ణయ్య.. మేనమామ చంద్రయ్యకు ఆదివారం సాయంత్రం ఫోన్ చేశాడు. ‘అమ్మను అన్నను జాగ్రత్తగా చూసుకో.. నేను చనిపోతున్నాను […]</p>

X
దిశ, గండీడ్: ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెట్టడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గండీడ్ మండలం వెన్నాచేడ్‌లో ఈ ఘటన జరిగింది. ఇదే గ్రామానికి చెందిన చెవిటి కృష్ణయ్య (21) తల్లి, అన్నతో కలిసి నివాసం ఉంటున్నాడు. గత కొన్నేండ్ల క్రితం తండ్రి చనిపోయాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి ఇబ్బందిగా మారడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కృష్ణయ్య.. మేనమామ చంద్రయ్యకు ఆదివారం సాయంత్రం ఫోన్ చేశాడు. ‘అమ్మను అన్నను జాగ్రత్తగా చూసుకో.. నేను చనిపోతున్నాను అంటూ చంద్రయ్యతో చివరిసారిగా మాట్లాడాడు. దీంతో వెంటనే గాలింపు చేపట్టిన మేనమామ చెరువు దగ్గర కూడా వెతికాడు. అయినప్పటికీ కనిపించలేదు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో చెరువులో గాలింపు చర్యలు ముమ్మరం చేసి మృతదేహాన్ని బయటకు తీశారు.
Next Story






